Leading News Portal in Telugu

Jr NTR: ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్..


Jr NTR: ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్..

స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇండియాలో మాదిరిగానే ఇతర దేశాల్లోనూ కొందరు ఎన్టీఆర్‌ను ఇష్టపడితే.. మరికొందరు రామ్ చరణ్‌ను ప్రశంసించారు. అంతేకాదు స్వయంగా కలిసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలేవి. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు గర్వంగా చెప్పుకునే గౌరవం ఒకటి తారక్‌కు దక్కింది.. అరుదైన గౌరవం ఎన్టీఆర్ కు దక్కింది..

ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరేందుకు ఆయనకు ఆహ్వానం అందింది.. అయితే, అకాడమీ తన యాక్టర్స్ బ్రాంచ్‌లో కొత్త సభ్యులను సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ కొత్త సభ్యుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు కావడం విశేషం. ఆస్కార్ విన్నర్ కే హుయ్ క్వాన్, మర్షా స్టీఫనీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్‌తో పాటు ఎన్టీ రామారావు జూనియర్ పేరును అకాడమీ ప్రకటించింది. వీళ్లు ఐదుగురికీ యాక్టర్స్ బ్రాంచ్‌లోకి స్వాగతం చెబుతూ సోషల్ మీడియాలో అకాడమి పోస్ట్ చేసింది..

ఆస్కార్ నివేదిక ప్రకారం..బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆహ్వానం మేరకు యాక్టర్స్ బ్రాంచ్‌లో సభ్యత్వం పొందుతారు. మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో యాక్టివ్ ఉన్నవాళ్లకు, వెండితెరపై ప్రతిభను చాటుకున్నవాళ్లలో కొంత మందికి మాత్రమే ఈ సభ్యత్వానికి ఆహ్వానాలు పంపుతారు. అలాగే, సభ్యత్వం పొందాలంటే మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో డిస్టిక్షన్ సాధించి ఉండాలని కూడా అకాడమీ పేర్కొంది. అంతేకాకుండా, యాక్టర్స్ బ్రాంచ్‌లో స్థానం పొందాలంటే ఆ నటుడు కనీసం మూడు థియేట్రికల్ ఫీచర్ ఫిలింస్‌లో నటించి ఉండాలి.. అలాగే ఆ సినిమా ఐదేళ్లలోపు నటించి ఉండాలట.. యాక్టింగ్ కేటగిరీలో అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యి ఉండాలి. ఈ నిబంధనలన్నీ పరిగణనలోకి తీసుకొనే అకాడమి ఎన్టీఆర్ ను ఎంపిక చేసింది.. యాక్టర్స్ బ్రాంచ్‌లో స్థానం సంపాదించడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్ను చూసి గర్వపడుతున్నాం అన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు.. తమ హీరో గ్రేట్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. దేవర సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది…