Leading News Portal in Telugu

Karthika : రంగం భామ ఎంగేజ్మెంట్..? వైరల్ అవుతున్న పిక్స్..


Karthika : రంగం భామ ఎంగేజ్మెంట్..? వైరల్ అవుతున్న పిక్స్..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవి సరసన  అధిక చిత్రాల్లో నటించి రాధ స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది..అలాగే రాధ కుమార్తె కార్తీక నైర్ కూడా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య సరసన జోష్ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో ఈ భామ బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ అందుకుంది.. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం తో ఈ భామకు ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు.తెలుగులో అల్లరి నరేష్ తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో ఈ భామకు తెలుగులో అవకాశాలు రాలేదు.

ఇటీవల కార్తీక సినిమాల పరంగా అంత యాక్టివ్ గా అయితే లేదు. అయితే సడెన్ గా కార్తీక నైర్ ఎంగేజ్మెంట్ పూర్తయింది అంటూ తమిళనాట కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే కార్తీక ఇంస్టాగ్రామ్లో ఓ క్రేజీ పోస్ట్ ను పెట్టింది. కార్తీక ఓ వ్యక్తిని హగ్ చేసుకుని ఉన్న పిక్ ని ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో తన వేలికి ఉన్న రింగ్ కూడా హైలైట్ అయ్యేలా ఫోజు ఇచ్చింది. దానితో కార్తీక నిశ్చితార్థం చేసుకుంది అని నెటిజన్లు భావిస్తున్నారు.వరుడి ఎవరు అంటూ నెటిజన్లు ఆరా తీయడం కూడా ప్రారంభించారు. అయితే కార్తీక ఎంగేజ్మెంట్ గురించి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కార్తీక నిశ్చితార్థం పూర్తయింది అని.. ఆమె వివాహం కూడా త్వరలోనే జరగనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.హీరోయిన్ గా ఆశించిన ఆఫర్స్ రాకపోవడంతో కార్తీక నైర్ వివాహం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే కార్తీక ది లవ్ మ్యారేజ్ లేక అరేంజ్డ్ మ్యారేజ్ అనేది ఇంకా క్లారిటీ లేదు. ఆమె నిశ్చితార్థం గురించి అధికారిక ప్రకటన, పెళ్లి తేదీ లాంటి వివరాలు త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నట్లు సమాచారం.