Leading News Portal in Telugu

The Nun 2 : ఓటీటీ లోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.


The Nun 2 : ఓటీటీ లోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హారర్ మూవీ.

తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే హారర్ మూవీస్ ఎప్పుడు ఆదరిస్తూ వుంటారు. అయితే మొదటి నుంచి హారర్ జోనర్ చిత్రాలకు పెట్టింది పేరు హాలీవుడ్ ఇండస్ట్రీ..ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌ నుంచి అనేక హార్రర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చిన మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ ది నన్. ఈ సినిమా ప్రేక్షకులను ఒక రేంజ్‌లో భయపెట్టింది.ది నన్ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీ విజయం సాధించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ది నన్ 2 సినిమా వచ్చింది..

సుమారు ఐదేళ్ల తర్వాత వచ్చిన ది నన్ 2 సినిమాను జేమ్స్ వాన్, పీటర్ సాఫ్రన్, జుడ్సన్ స్కాట్ సంయుక్తంగా నిర్మించారు. మైఖేల్ చేవ్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సిస్టర్ ఇరేనే అనే మెయిన్ లీడ్ రోల్‌లో టైస్సా ఫార్మి చేసింది. సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ థియేటర్లలో విడుదలైన ది నన్ 2 భారీ వసూళ్లు రాబట్టింది.ఆద్యంతం ప్రేక్షకులను భయపెట్టి ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దేవత లాంటి ఓ యువతి దెయ్యంగా ఎలా మారింది వంటి కథాంశంతో ది నన్ 2 సినిమా తెరకెక్కింది.ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అలాగే స్పెషల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టింది.అలాంటి మూవీ ది నన్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 19 నుండి ది నన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది.అమెజాన్ ప్రైమ్‌లో ది నన్ 2 ఇంగ్లీషుతో పాటు తెలుగు తమిళం, హిందీ వెర్షన్‌లలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, సినిమాను ప్రస్తుతం రెంటల్ విధానంలో ప్రసారం చేస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది.. అమెజాన్ ప్రైమ్ వీడియో తో పాటు బుక్ మై షో ఓటీటీలో కూడా ది నన్ 2 సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.