
Venu Yeldandi: వేణు ఏల్దెండి.. ప్రస్తుతం ఈ పేరు దేశవిదేశాల్లో వినిపిస్తుంది. ఈ ఏడాది రిలీజై బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమాల్లో బలగం ఒకటి. చిన్న సినిమాగా రిలీజైన బలగం.. భారీ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్స్ తో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులను కూడా అందుకుంది. టిల్లు వేణు నుంచి జబర్దస్త్ వేణుగా మారిన ఈ కమెడియన్ ఇప్పుడు బలగం డైరెక్టర్ వేణుగా మారాడు. ఇక ఈ సినిమా తరువాత వేణు.. మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలిపాడు. బలగం వేణు రెండోసారి తండ్రి అయ్యాడు. పండంటి ఆడబిడ్డకు వేణు భార్య జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వేణు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
Navaratri Special : కాంతార సీన్.. ఆకట్టుకుంటున్న దుర్గమ్మ పూజ.. ఎక్కడంటే?
“ఆడబిడ్డ జన్మించింది. ఈ శుభవార్తను నా పెద్ద కుటుంబంతో పంచుకోవడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. వేణుకు ఇప్పటికే రేవంత్ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టడంతో .. ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందని వేణు సంబరపడిపోతున్నాడు. ఇక ఈ న్యూస్ తెలియడంతో ఫ్యాన్స్.. వేణుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే బలగం తరువాత.. వేణు .. ఒక స్టార్ హీరోకు కథ వినిపించాడు అని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. తనకు బాలగంతో హిట్ ను ఇచ్చిన ప్రియదర్శితోనే మరో సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. మరి కూతురు పుట్టిన సంతోషంలో త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తాడేమో చూడాలి.