Leading News Portal in Telugu

Priya Bhavani Shankar: స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన సీరియల్ బ్యూటి..


Priya Bhavani Shankar: స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన సీరియల్ బ్యూటి..

ఈ మధ్య హీరోయిన్స్ అందరు బుల్లి తెర నుంచి వెండి తెరపై నటించే అవకాశాలను అందుకుంటున్నారు.. వారి నటనతో జనాలను మాత్రమే సినీ దర్శక నిర్మాతలను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు.. అలా తెలుగు, తమిళ్ నటులు చాలానే ఉన్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు ప్రియా భవానిశంకర్‌.. సీరియల్స్ తో మెప్పించిన ఈ అమ్మడు చిన్న హీరోల సరసన జత కట్టింది.. పలు సినిమాల్లో నటించింది.. ఆ సినిమాలతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది..

‘తెగింపు’ సినిమాతో ఈ ఏడాది హిట్ కొట్టిన అజిత్.. ప్రస్తుతం ‘విడాముయర్చి’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 62వ మూవీ.. ఈ సినిమాకు కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని క్లియర్ చేసుకొని సెట్స్ మీదకి వెళ్తుంది.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి మగిళ్‌ తిరుమేణి దర్శకుడు. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.. ప్రస్తుతం అజర్ బైజాన్‌ దేశంలో షూటింగ్ జరుగుతోంది. త్రిష, హ్యూమా ఖురేషి హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే హ్యూమా ఈ సినిమా నుంచి తప్పుకొందని ఆమె బదులు రెజీనాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది..

ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని టాక్.. అందుకోసం ప్రియా భవానిశంకర్‌ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. ఇదే కనుక నిజమైతే అజిత్‌ సరసన ప్రియాభవానికి ఇది తొలి సినిమా అవుతుంది. ఇప్పుటివరకు యంగ్ హీరోల సరసన చేసిన అమ్మడు ఇప్పుడు శంకర్‌-కమలహాసన్‌ కాంబోలో తీస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. ఈ బుల్లితెర నటి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌ రేంజుకి చేరిపోయిందనమాట.. ఇక అజిత్ సినిమాలో అంటే అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి..