Leading News Portal in Telugu

Sharathulu Varthisthayi :’షరతులు వర్తిస్తాయి’ అంటున్న 30 వెడ్స్ 21 చైతన్య రావ్.. ఫస్ట్ లుక్ విడుదల !!!


Sharathulu Varthisthayi :’షరతులు వర్తిస్తాయి’ అంటున్న 30 వెడ్స్ 21 చైతన్య రావ్.. ఫస్ట్ లుక్ విడుదల !!!

Director Trivikram launched Sharathulu Varthisthayi movie first look: 30 వెడ్స్ 21 చైతన్య రావ్ హీరోగా భూమి శెట్టి హీరోయిన్ గా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున్ సామల,శ్రీష్ కుమార్ గుండా,డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మాణంలో కుమార స్వామి ( అక్షర ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంఛ్ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు ఉంటాయని, కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయని అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్య జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయని తెలిపారు.

Geetha Arts: నేషనల్ క్రష్ తో సెన్సిబుల్ డైరెక్టర్ సినిమా…

ఇక షరతులు వర్తిస్తాయి సినిమా కుటుంబ విలువలకు సంబంధించిన సినిమా అని ఈ ప్రాంతం మట్టి నుంచి వచ్చిన కథ అని ఇది మన కుటుంబ సంస్కృతిక విలువలతో నిండి ఉన్న సినిమా ఇటువంటి మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహించాలని న్నారు. ఈ సినిమా హీరో చైతన్య రావు మాట్లాడుతూ మా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ ఆవిష్కరించడం తనకెంతో ఆనందాన్నిచ్చింది, ఇంత బిజీలో కూడా మాకు సమయం కేటాయించి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఏ సినిమాలో నంద కిశోర్, సంతోష్ యాదవ్, పెద్దింటి అశోక్ కుమార్, మల్లేష్ బలాస్ట్, వెంకీ మంకీ, దేవ రాజ్ పాలమూర్, పద్మావతి, సీతామహాలక్ష్మీ, సుజాత దేవి, శివ కళ్యాణ్, సుజాత ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాయి సినిమాకి అరుణ్ చిలివేరు మ్యూజిక్ అందిస్తున్నారు.