Leading News Portal in Telugu

Allu Arjun: పార్టీని పక్కకు పెట్టి.. దిల్ రాజు ఇంటికి వెళ్లిన బన్నీ


Allu Arjun: పార్టీని పక్కకు పెట్టి.. దిల్ రాజు ఇంటికి వెళ్లిన బన్నీ

Allu Arjun:నిర్మాత దిల్ రాజు ఇంట పది రోజుల క్రితం తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయ తెల్సిందే. దిల్‌ రాజు తండ్రి శ్యామ్‌ సుందర్‌రెడ్డి (86) అక్టోబర్ 9 న కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శ్యామ్‌ సుందర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. శ్యామ్‌ సుందర్‌ రెడ్డి మరణంతో దిల్ రాజు కృంగిపోయాడు. ప్రకాష్ రాజ్ ను పట్టుకొని దిల్ రాజు.. ఎమోషనల్ అయిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం కూడా తెల్సిందే. దిల్ రాజు తండ్రి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పటికే రామ్ చరణ్.. దిల్ రాజు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించాడు. ఇక నేడు శ్యామ్‌ సుందర్‌రెడ్డి దశదిన కర్మను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసి.. శ్యామ్‌ సుందర్‌రెడ్డికి నివాళులు అర్పించారు.

Kajal Aggarwal: కాజల్ కు అంత అన్యాయం చేస్తావా.. అనిల్ బ్రో.. ?

ఇక కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి, ఆయన్ను పరామర్శిచించాడు. శ్యామ్‌ సుందర్‌రెడ్డికి నివాళులు అర్పించి, దిల్ రాజు తో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఒకపక్క మైత్రి మూవీ మేకర్స్ .. బన్నీకి నేషనల్ అవార్డు వచ్చినందుకు గండిపేట లో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడ పార్టీని పక్కన పెట్టి.. ముందు బన్నీ, దిల్ రాజు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించాడు. దిల్ రాజు కు, అల్లు అర్జున్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీరి కాంబోలో ఎవడు, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మిస్తుండగా .. బన్నీ పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు.