Leading News Portal in Telugu

Game Changer : గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ వాయిదా.. తీవ్ర నిరాశలో మెగా ఫ్యాన్స్..?


Game Changer : గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ వాయిదా.. తీవ్ర నిరాశలో మెగా ఫ్యాన్స్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ వైడ్ గా ఫేమ్ వచ్చింది…ఆ ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”గేమ్ ఛేంజర్”.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. కానీ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ శంకర్ ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ కాస్త కోపంగా ఉన్నారు. అయితే ఈ దసరా కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారని న్యూస్ నెట్టింట ఓ వార్త వైరల్ అయ్యింది..

దీంతో దసరాకు అయినా అప్డేట్ రాబోతుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..కానీ ఇప్పుడు ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే ఎదురైనట్లు తెలుస్తుంది… ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ పై మెగా కాంపౌండ్ నుంచి వస్తున్నా వార్తల ప్రకారం ఈ సినిమా నుండి దసరా కానుకగా సాంగ్ ను రిలీజ్ చేయడం లేదట.. ప్రస్తుతం చిత్ర యూనిట్ తమ ప్లాన్స్ అన్ని నిలిపి వేశారని దీంతో ఈ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇప్పట్లో ఇచ్చే ఆలోచనలో కూడా మేకర్స్ లేనట్టు సమాచారం.అయితే ఈ న్యూస్ ఫ్యాన్స్ కు మరింత కోపం తెప్పిస్తుంది.. ఇప్పటికైనా ఏదొక అప్డేట్ వస్తుంది అని ఎదురు చూసే ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ ఎదురవడంతో ఫ్యాన్స్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం… కాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రాంచరణ్ సరసన మరోసారి హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా నుంచి శంకర్ బిగ్ అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి…