
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం హీరోగా అడుగులు వేస్తున్నాడు. జబర్దస్త్ అనే స్టేజ్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారాడు. గాలోడు సినిమాతో మంచి విజయాన్ని అందుకొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో రెండు, మూడు సినిమాల వరకు ఉన్నాయి. అందులో ఒకటి గోట్(GOAT)..గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ట్యాగ్ లైన్. పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. సుధీర్ సరసం బ్యాచిలర్ భామ దివ్య భారతి హీరోయిన్గా నటిస్తుస్తుంది. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Payal Rajputh: ఆ వ్యాధితో బాధపడుతున్నా.. సర్జరీ చేయాలనీ డాక్టర్స్ చెప్పారు
ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టినట్లు మేకర్స్ తెలిపారు. టాలీవుడ్ బెస్ట్ డీఓపీ లో ఒకరైన రసూల్ ఎల్లోర్ ఈ సినిమాకు డీఓపీ గా పనిచేస్తున్నాడు. ఇక ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ షెడ్యూల్ లో చమ్మక్ చంద్ర కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. సినిమా తీసే విధానం బట్టి ఈసారి కూడా సుధీర్ హిట్ కొట్టేలా ఉన్నాడే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో సుధీర్ హిట్ అందుకొని .. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడో లేదో చూడాలి.