Leading News Portal in Telugu

Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ మూడో రోజు కలెక్షన్స్..ఎన్ని కోట్లంటే?


Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ మూడో రోజు  కలెక్షన్స్..ఎన్ని కోట్లంటే?

టాలివుడ్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలయ్య, హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావీపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ భగవంత్ కేసరి.. ఈ సినిమా దసరా కానుకగా 19న విడుదల అయ్యింది.. తొలిరోజే ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. మూవీలో చూపించిన ఎమోషన్, యాక్షన్, కామెడీ, మహిళా సాధికారిత అంశాలు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది..

ఈ సినిమా తొలిరోజే అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టిన విషయం తెలిసిందే.. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ32.33 కోట్ల గ్రాస్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. ఇక తాజాగా రెండో రోజు కలెక్షన్లు కూడా సాలిడ్ గానే అందుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం రెండు రోజుల్లో మొత్తంగా రూ.51.12 కోట్ల గ్రాస్ ను ప్రపంచ వ్యాప్తంగా సాధించింది… ఇక మూడో రోజు భారీగా వసూల్ చేసిందని తెలుస్తుంది.. ఈ రోజుకుగాను రూ.71.2 కొట్లు వసూల్ చేసిందని తాజాగా చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను విడుదల చేశారు..

ఇప్పటికే ఈ సినిమాను దసరా విన్నర్ గా ప్రకటించారు. దసరాకు విడులైన చిత్రాల్లో ‘భగవంత్ కేసరి’కి మంచి రెస్పాన్స్ దక్కడం. ఇక మున్ముందు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రిజల్ట్ ను అందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటించింది. శ్రీలీలా కూతురు పాత్రలో అదరగొట్టింది. నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ గా మెప్పించారు. థమన్ సంగీతంతో సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంది.. ఈ సినిమా కలెక్షన్స్ దసరా రోజుకు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి..