Leading News Portal in Telugu

Bhagavanth Kesari: అడవి బిడ్డకు 100 కోట్లు!


Bhagavanth Kesari: అడవి బిడ్డకు 100 కోట్లు!

అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకున్నాడు బాలయ్య.  ఈ సినిమాలో అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరిగా కనిపించిన బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరి, బాలయ్యని నెవర్ బిఫోర్ రోల్ లో చూపించింది. బ్యాడ్ టచ్ సీన్ లో బాలయ్య చేసిన పెర్ఫార్మెన్స్ ని ఎన్ని సార్లు చూసినా తక్కువే అవుతుంది అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్ మోడ్ లో భగవంత్ కేసరి సినిమా చూస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన పోలీస్ గెటప్ ని కూడా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ రెండూ బ్యాలన్స్ అవ్వడం అనేది బాలయ్య సినిమాల్లో చాలా రేర్ గా జరిగే విషయం. భగవంత్ కేసరి సినిమా విషయంలో ఇలాంటి అద్భుతమే జరిగింది.

ఈ కారణంగానే భగవంత్ కేసరి సినిమా బాలయ్య ఇప్పటికి వరకూ చేసిన సినిమాల్లన్నింటికన్నా చాలా స్పెషల్ అనే చెప్పాలి. మౌత్ టాక్ సూపర్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతుండడంతో బుకింగ్స్ పరంగా భగవంత్ కేసరి ట్రెండ్ అవుతోంది. మొదటి రెండు రోజుల్లాగే మూడో రోజు కూడా దుమ్ముదులిపేసిన బాలయ్య… వరల్డ్ వైడ్ మూడురోజుల్లో వరల్డ్ వైడ్‌గా 71.2 కొట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక సండే రోజు కూడా కేసరి బుకింగ్స్ అదిరిపోయిందని అంటున్నారు. మండే దసరా కావడంతో.. మొత్తంగా 5 రోజుల్లోనే భగవంత్ కేసరి 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ కానుంది. దీంతో సీనియర్ హీరోల్లో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ రాబట్టిన హీరోగా.. రేర్ రికార్డ్ సొంతం చేసుకోనున్నాడు బాలయ్య.