Leading News Portal in Telugu

Jailer: రజినీ సినిమాకి 170 కోట్ల లాభం… లియోకి ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం


Jailer: రజినీ సినిమాకి 170 కోట్ల లాభం… లియోకి ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం

సూపర్ స్టార్ రజినీకాంత్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చింది జైలర్ సినిమా. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అసలు అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి 600 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్స్ లిస్టులో రోబో 2.0 తర్వాత జైలర్ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. అనిరుద్ మ్యూజిక్, రజినీ వింటేజ్ స్వాగ్ అండ్ స్టైల్, నెల్సన్ మేకింగ్, శివన్న-మోహన్ లాల్ క్యామియో… జైలర్ సినిమాని మూవీ లవర్స్ సెలబ్రేట్ చేసుకునేలా చేసింది. సౌత్ ఇండియా మొత్తం 50 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన మొదటి తమిళ సినిమాగా చరిత్రకెక్కిన జైలర్ సినిమా, కోలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. 124 కోట్ల ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ తో రిలీజ్ అయిన జైలర్ సినిమా, ఓవరాల్ గా 294 కోట్ల షేర్ ని రాబట్టింది. థియేటర్ బిజినెస్ తో పోల్చుకుంటే అన్ని సెంటర్స్ కలిపి జైలర్ సినిమా 170 కోట్ల ప్రాఫిట్ ని రాబట్టింది.

బయ్యర్స్ అందరినీ లాభాల్లో ముంచి తేల్చిన జైలర్ సినిమా కలెక్షన్స్ ని విజయ్ టార్గెట్ చేస్తూ లియో సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ రెండు మూడు రోజుల్లో 230 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టింది. టాక్ యావరేజ్ గానే ఉంది కానీ దసరా ఫెస్టివల్ సీజన్ కావడంతో లియో కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి. లాంగ్ రన్ లో లియో మిరాకిల్స్ చేసే అవకాశం ఉంది కానీ జైలర్ రికార్డ్స్ ని బీట్ చేయడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే లియో సినిమా థియేట్రికల్ రైట్స్ ని ప్రొడ్యూసర్స్ 210 కోట్లకి అమ్మారు. సో ఆల్మోస్ట్ 420-420 కోట్లు రాబడితేనే లియో సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవుతుంది. 420 కోట్ల తర్వాతి నుంచే లియో సినిమాకి ప్రాఫిట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ లెక్కన జైలర్ లా 170 కోట్ల ప్రాఫిట్స్ తీసుకోని రావాలంటే లియో సినిమా వరల్డ్ వైడ్ 750-800 కోట్ల వరకూ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. జైలర్ తక్కువకి అమ్మారు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి. లియో అమ్మిందే ఎక్కువకి కాబట్టి చాలా ఎక్కువ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. టాక్ అంతంతమాత్రంగానే ఉంది కాబట్టి లాంగ్ రన్ లో కూడా లియో ఈ ఫీట్ ని సాదించడం కష్టమనే చెప్పాలి.