
Dil Raju: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. అక్టోబర్ 19 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఆడపిల్లల గురించి, వారిని పులుల్ల పెంచాలని చెప్పిన తీరు ప్రేక్షకులకు నచ్చడంతో.. థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఇందుకు తోడు.. అనిల్ రావిపూడి, శ్రీలీల చేస్తున్న ప్రమోషన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. ముఖ్యంగా అనిల్ రావిపూడి అయితే .. బుల్లితెర, యూట్యూబ్, సోషల్ మీడియా దేన్నీ వదలకుండా కవర్ చేశాడు. ఇంకోపక్క శ్రీలీల.. బాలయ్య తో ఇంటర్వ్యూలు చేసి హైప్ పెంచేసింది. ఇక ఈ మధ్యనే అన్ స్టాపబుల్ ప్రోగ్రాం లో చిత్ర బృందం అంతా సందడి చేశారు. సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అని ప్రమోషన్స్ ఆపలేదు. ఇంకా కొనసాగిస్తున్నారు.
Pragathi: ప్రగతి ఆంటీ.. నువ్వు కూడా మొదలెట్టావా.. ?
తాజాగా నిర్మాత దిల్ రాజు.. యాంకర్ గా మారాడు. అనిల్ రావిపూడి, శ్రీలీల ను ఇంటర్వ్యూ చేసాడు. భగవంత్ కేసరి నైజం హక్కులను సొంతం చేసుకుంది దిల్ రాజునే. అందుకే ఈ ఇంటర్వ్యూలో పాల్గున్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు ఇంట ఈ మధ్య విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. పది రోజుల క్రితం ఆయన తండ్రి మృతి చెందారు. నిన్ననే దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఇంకో వారం రోజుల వరకు దిల్ రాజు బయటికి రాడు అనుకున్నారు. కానీ, తండ్రి చనిపోయిన బాధలో ఉండి కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు అంటే.. అది గ్రేట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారాయి.