
Pragathi: బుల్లితెర చూడని ప్రజలు ఉండరు. అసలు టీవీ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలకు థియేటర్ కు వేళ్ళని వారైనా ఉంటారేమో కానీ, టీవీ లో సీరియల్ చూడని ఆడవారు లేరు అంటే నమ్మశక్యం కానీ పని. మొన్న ఎవరో సీరియల్ కోసం కట్టుకున్న భర్తనే చంపేసిందంట. అలా ఉంటాయి సీరియల్స్. అందుకే చాలామంది సీరియల్స్ లో నటించడానికి వెనుకాడడం లేదు. ముఖ్యంగా నాటితరం నటీమణులు.. సీరియల్స్ ద్వారా బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చి .. సినిమా ఆఫర్లను పెట్టేస్తున్నారు. ఒకప్పుడు సినిమా అవకాశాలు లేక సీరియల్స్ కు వచ్చేవారు అనేవారు .. కానీ, ఇప్పుడు సీరియల్స్ చేసి.. ఇంకా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు. రాధికా దగ్గర నుంచి ఆమనీ వరకు సీరియల్స్ లో నటించి మెప్పించినవారే . ఇక వీరి లిస్ట్ లోకి చేరింది నటి ప్రగతి.
Pawan Kalyan: వంగవీటి రాధా పెళ్లిలో పవన్.. ఫోటో వైరల్
ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాలో హీరోయిన్ కు తల్లిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆమె ఎన్నో సినిమాల్లో తల్లిగా, అత్తగా నటించి మెప్పించింది. ఇక సినిమాలన్నీ ఒక ఎత్తు .. ఆమె సోషల్ మీడియా ఒక ఎత్తు. తనకు నచ్చినట్లు ఫ్యాషన్ గా ..అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రగతి కొన్ని రోజుల నుంచి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సడెన్ గా ఆమె స్టార్ మా లో ప్రసార కానున్న కొత్త సీరియల్ లో ప్రత్యక్షమయింది. తాజాగా ఈ సీరియల్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోయిన్ కు అత్తగారు హోదాలో కనిపించింది. అత్తగారి అహం తగ్గించడానికి కోడలు ఏం చేసింది అనేది సీరియల్ కథల తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ప్రోమో చూసిన ప్రగతి ఫ్యాన్స్.. ప్రగతి ఆంటీ.. నువ్వు కూడా సీరియల్స్ మొదలుపెట్టావా.. ? అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సీరియల్ తో ప్రగతి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.