
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన డివోషనల్ మూవీ ఆదిపురుష్.భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా మరియు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తొలి మూడు రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నెగటివ్ టాక్ తో తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి.ఆదిపురుష్ ప్రభాస్ కు వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్ ను మిగిల్చింది. అంతకు ముందు సాహో, రాధేశ్యామ్ సినిమాలు కూడా ప్లాప్స్ గా మారిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ మూవీకి ఓటీటీలోనూ పెద్దగా ఆదరణ లభించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటు లో ఉంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అనుకున్న సమయం కంటే ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
ఈ సినిమా రిలీజ్ సమయం లోనూ ఎన్నో వివాదాలు చెలరేగాయి. విమర్శలూ కూడా వచ్చాయి..రామాయణాన్ని పూర్తిగా నాశనం చేశారంటూ డైరెక్టర్ ఓంరౌత్ పై ఎంతో మంది విరుచుకుపడ్డారు. ఇదిలా ఉంటే ఈ మూవీ టీవీ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. ఓవైపు రెబల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి మూవీ సలార్: సీజ్ ఫైర్ విడుదల కోసం ఎదురు చూస్తున్న వేళ..ఆదిపురుష్ వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ను స్టార్ మా వెల్లడించింది. ఈ సినిమా వచ్చే ఆదివారం (అక్టోబర్ 29) సాయంత్రం 5.30 గంటలకు రానున్నట్లు స్టార్ మా తెలిపింది.ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.సలార్ సినిమాపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.అలాగే సలార్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD సినిమా పై కూడా భారీ అంచనాలు వున్నాయి.