
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప కథను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు… ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఇటీవలే కన్నప్ప మూవి షూటింగ్ ను విష్ణు విదేశాల్లో మొదలు పెట్టాడు.ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఈ సినిమా లో శివుడి పాత్రలో కనిపించనున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. అలాగే పార్వతి దేవిగా నయనతార నటించనుందని ఇప్పటికే వీరితో మంచు విష్ణు సంప్రదింపులు కూడా చేసారని వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే మరికొంతమంది స్టార్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది.కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. శివ రాజకుమార్ కన్నడ ఇండస్ట్రీలో శివన్నగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు . ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ లో క్యామియో రోల్ చేసి అదరగొట్టారు ఇప్పుడు మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప లో శివరాజ్ కుమార్ నటిస్తునారని ప్రచారం జరుగుతుంది.ఆ తర్వాత చిత్ర బృందం నుంచే అధికారికంగా సమాచారం వచ్చింది.
అలాగే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. ఆయన ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం..ఇక కన్నప్ప సినిమాకు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కన్నప్ప టీం డార్లింగ్‌కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపింది. ప్రభంజనమై ప్రేక్షక హృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకుని.. ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి అంటూ కన్నప్ప స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించనున్నారు.. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు.ప్రస్తుతం కన్నప్ప టీం న్యూజిలాండ్‌లో షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మిగతా నటీనటులు మరియు సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు…