Leading News Portal in Telugu

Nata Simham Rampage: ఓవర్సీస్ లో బాలయ్య మాత్రమే సాధించిన ఘనత ఇది…


Nata Simham Rampage: ఓవర్సీస్ లో బాలయ్య మాత్రమే సాధించిన ఘనత ఇది…

నెలకొండ భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ క్రియేట్ చేస్తున్నాడు. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ అందించింది. అనిల్ రావిపూడి రెగ్యులర్ బాలయ్య సినిమాలాగా భగవంత్ కేసరిని ట్రీట్ చేయకుండా… సోషల్ మెసేజ్ ని మిక్స్ చేసి మంచి సినిమాని ఇచ్చాడు. ఈరోజు భగవంత్ కేసరి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది అంటే అది పూర్తిగా అనిల్ రావిపూడి కథలో చూపించిన కొత్తదనం కారణంగా అనే చెప్పాలి. బాలయ్య ఏజ్ కి తగ్గ పాత్రలో, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి నటించాడు. తెరపై ఇప్పటివరకూ కనిపించని కొత్త బాలయ్య కనిపించాడు. బాక్సాఫీస్ దగ్గర క్లాష్ ఉన్నా కూడా బాలయ్య మాత్రం మంచి కలెక్షన్స్ ని రాబడుతూనే ఉన్నాడు.

అమలాపురం నుంచి అమెరికా వరకూ బాలయ్య బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కన్నా ఓవర్సీస్ లో బాలయ్య మరోసారి తన సత్తా చూపిస్తున్నాడు. అఖండ సినిమాతో మొదటిసారి వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన బాలయ్య… వీర సింహా రెడ్డితో రెండో సారి వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసాడు. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ వన్ మిలియన్ డాలర్ మార్క్ ని బాలయ్య రీచ్ అయ్యాడు. సీనియర్ హీరోల్లో ఓవర్సీస్ మార్కెట్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ మూడు సార్లు వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన ఏకైక హీరో హీరోగా బాలయ్య కొత్త హిస్టరీ క్రియేట్ చేసాడు. చిరు, వెంకటేష్, నాగార్జునల కన్నా ఓవర్సీస్ లో బాలయ్య మంచి జోష్ లో ఉన్నాడు. నెక్స్ట్ బాబీ సినిమాతో కూడా వన్ మిలియన్ మార్క్ ని టచ్ చేస్తే… యంగ్ హీరోలకి కూడా బాలయ్య నుంచి కాంపిటీషన్ వచ్చినట్లే.