
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు దసరా విన్నర్ గా నిలిచాడు. ఈ దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు రిలీజ్ అవ్వగా.. మౌత్ టాక్ నుంచి కలక్షన్స్ వరకు భగవంత్ కేసరి పాజిటివ్ గా రావడంతో ఈ సినిమా దసరా విన్నర్ అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా .. శ్రీలీల కీలక పాత్రలో నటించింది. ఇక అనిల్ రావిపూడి, బాలకృష్ణ తమ జోనర్ ను పక్కన పెట్టి వైవిధ్యంగ ప్రయత్నించడం.. అందులోనూ ఆడపిల్లల గురించి చెప్పడంతో ప్రేక్షకులు సినిమాకు క్యూ కడుతున్నారు.
IFFI 2023: ఇదేంటి ఆస్కార్ కొట్టినా.. తెలుగు భాష ఉందని మర్చిపోయారా?
ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు బాలయ్య న్యూ లుక్ లో రావడం సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. భగవంత్ కేసరి కోసం గడ్డం, మీసాలు పెంచిన బాలయ్య.. ఇప్పుడు గడ్డం తీసి క్లీన్ షేవ్ తో కనిపించాడు. దీంతో బాలయ్య న్యూ లుక్ ఆకట్టుకొంటుంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కొత్త సినిమా కోసమే బాలయ్య .. లుక్ మార్చాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చాలా రోజుల తరువాత బాలకృష్ణ గడ్డం లేకుండా కనిపించడంతో.. అభిమానులు ఆ లుక్ కు ఫిదా అవుతున్నారు. మరి చిరంజీవికి వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ఇచ్చిన బాబీ .. బాలయ్యకు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.