Leading News Portal in Telugu

Nani : నాని ప్రయోగాత్మక చిత్రాలు చూసి కంగారు పడుతున్న ఫ్యాన్స్..


Nani : నాని ప్రయోగాత్మక చిత్రాలు చూసి కంగారు పడుతున్న ఫ్యాన్స్..

నేచురల్ స్టార్ నాని ఈమధ్య వరుసగా ఎక్స్పరిమెంటల్ సినిమాలు ఒప్పుకుంటూ రిస్కు చేస్తున్నాడు అని అభిమానులు ఎంతో కంగారుపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని స్టోరీ సెలక్షన్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు.ఇప్పటికే తన సినిమాలతో ఎప్పటికప్పుడు నాని ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. డైరెక్టర్ తో సంబంధం లేకుండా కేవలం కథ ను మాత్రమే నమ్మి నాని సినిమాలు చేస్తుంటాడు.కానీ ఈ మధ్య నాని వరుసగా రిస్కీ సినిమాలు చేస్తున్నారు.. నిజానికి “దసరా” సినిమా కూడా ఒక ఎక్స్పరిమెంటల్ సినిమానే అని చెప్పొచ్చు.. సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం నాని పాత్రను చూపించిన విధానం ఎంతో కొత్తగా ఉంటుంది. కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. తాజాగా ఇప్పుడు మరొక ఎక్స్పరిమెంటల్ సినిమాతో మరోసారి రిస్క్ చేయడానికి సిద్ధం అవుతున్నారు నాని.ఆ సినిమానే హాయ్ నాన్న . ఇది ఒక క్లాస్ సినిమా. చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ చూస్తేనే ఇందులో మాస్ ఎలిమెంట్లు ఉండవని తెలుస్తోంది. నానిని ఇంత క్లాస్ సినిమా లో చూడటానికి అభిమానులు నిజంగానే సిద్ధంగా ఉన్నారా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మాస్ సినిమాలో కంటెంట్ యావరేజ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉంటాయి. కానీ క్లాస్ సినిమా విషయంలో మాత్రం అలా జరగదు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ కూడ అద్భుతంగా వస్తే తప్ప సినిమా కలెక్షన్లు సరిగ్గా రావు.సినిమా విడుదల అయిన మొదటి రోజు నుంచి క్లాస్ సినిమలకు మంచి పాజిటివ్ టాక్ రావాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారు. గతంలో నాని, వివేక్ కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. కానీ రెండవసారి అదే డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు నాని.ఇక ఆ తర్వాత కూడా నాని తమిళ్లో డాన్ వంటి సినిమా తీసిన సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమా కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీనితో నాని డైరెక్టర్లతో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమాలను వరుసగా ఓకే చేస్తున్నారు అని తెలుస్తుంది..