Leading News Portal in Telugu

Mega 156: పాత పద్దతిని తిరిగి తీసుకొచ్చిన మెగాస్టార్ అండ్ టీమ్


Mega 156: పాత పద్దతిని తిరిగి తీసుకొచ్చిన మెగాస్టార్ అండ్ టీమ్

మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా దర్శకుడు వశిష్ఠతో చిరు 156 ప్రాజెక్ట్ ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. అనౌన్స్మెంట్ కోసం పంచభూతాలని పెట్టి డిజైన్ చేసిన పోస్టర్ ఇంప్రెస్ చేసింది. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ ని మొదలు పెట్టిన మేకర్స్… లేటెస్ట్ గా మెగా 156 సినిమా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఒకప్పుడు టాలీవుడ్ లో ఏ సినిమాకైనా ముందుగా సాంగ్స్ వర్క్ ని స్టార్ట్ చేసి, మ్యూజిక్ పని అయిన తర్వాత… రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే వాళ్లు. ఇప్పుడు ఆ ఫార్మాట్ ని ఎవరు వాడట్లేదు. చిరు-వశిష్ట మాత్రం పాత రూట్ నే ఎంచుకుంటూ మ్యూజిక్ వర్క్స్ ని ముందుగా స్టార్ట్ చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణీ… చిరు 156 కోసం డ్యూటీ ఎక్కాడు. బింబిసారా కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్న వశిష్ఠ, కీరవాణీతో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసాడు.

“In the good old days, films used to begin with music compositions, and #Mega156 has brought the tradition back to Telugu Cinema. Beginning the MEGA MASS BEYOND UNIVERSE with a celebratory song composition followed by an auspicious Pooja Ceremony” అంటూ మెగా 156 అప్డేట్ ని ట్వీట్ చేసింది యూవీ క్రియేషన్స్. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో కీరవాణీ మాట్లాడుతూ…”ఈ సినిమాలో ఆరు పాటలు ఉంటాయి… సినిమాని రీరికార్డింగ్ తో మొదలు పెట్టడం ఆనవాయితి. ఇప్పుడు అది ఫాలో అవుతూ ఒక సెలబ్రేషన్ సాంగ్ తో మెగా 156 పూజ కార్యక్రమాలు జరుపుకుంది” అని చెప్పాడు. చంద్రబోస్ ఈ సాంగ్ కి లిరిక్స్ రాసాడు. రాఘవేంద్ర రావు, వీవీ వినాయక్, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు అతిథులుగా మెగా 156 పూజ కార్యక్రమం జరిగింది.