
Thiruveer, Faria Abdullah Starrer Movie Started: జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాత్రతో సూపర్ క్రేజ్ సంపాదించిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా కొత్త సినిమా మొదలైంది. తిరువీర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త రవి పనస. ఈ సినిమాతో గోపి.జి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక ఈ సినిమా మొదటి షాట్ ను దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేయగా,బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ క్లాప్ కొట్టగా నిర్మాత రవి పనస కెమెరా స్విచ్ఛాన్ చేశారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25వ తేదీ నుంచి మొదలవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
Prabhutva Junior Kalasala: యదార్థ సంఘటనతో ‘’ప్రభుత్వ జూనియర్ కళాశాల’’.. ఇంట్రెస్టింగ్ గా టీజర్
అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందిస్తున్నామని తెలుగు తెరపై ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుందని, ఆడియెన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషిలతో పాటు రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు కె.పి మ్యూజిక్ అందిస్తుండగా గాంధీ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూనే కథ అందించారు గోపి.జి.