Leading News Portal in Telugu

Arjun Rampal: బాలయ్యా లవ్యూ అంటున్న బాలీవుడ్ హీరో


Arjun Rampal: బాలయ్యా లవ్యూ అంటున్న బాలీవుడ్ హీరో

Arjun Rampal Special Note on Nandamuri Balakrishna-Anil Ravipudis Bhagavanth kesari Film: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ ఒక స్పెషల్ నోట్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. భగవంత్ కేసరిపై తమ ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు నా ప్రగాఢ కృతజ్ఞతలు, నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. మా టీమ్ మొత్తానికి థాంక్స్, అనిల్ రావిపూడి మీరు చాలా ప్రతిభావంతులు, మీరు గిఫ్టెడ్ అని పేర్కొన్నారు.

Calling Sahasra: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘కాలింగ్ సహస్ర’ వచ్చేస్తోంది!

సాహు గారపాటి నన్ను నమ్మి నాకు మద్దతుగా నిలబడ్డారు. సెట్‌లో చాలా టాలెంటెడ్ – ఫన్ పర్సన్ అయిన శ్రీ లీలతో మంచి టైం స్పెండ్ చేశానని అన్నల. కాజల్ అగర్వాల్, మన సీన్ ను బాగా ఎంజాయ్ చేశాను. అలాగే సినిమా యూనిట్ మొత్తం అద్భుతమైన భోజనాలు, ప్రేమ అందించినందుకు థాంక్స్. తమన్ కి కూడా థాంక్స్, ముఖ్యంగా నాకు అందించిన ఒక అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నన్ను చాలా ఆకట్టుకుందని అన్నారు. ఇక మన భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ బ్రోకి, మీరు చాలా స్పెషల్. ఐ కేర్ బ్రదర్, ఐ లవ్ యూ అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక నాతో ఉన్నందుకు నా టీమ్ శ్రీనివాస్, నవీన్, లక్ష్, ఫర్హాన్, సుమిత్ కి కూడా థాంక్స్ అని ఆయన రాసుకొచ్చారు.