Leading News Portal in Telugu

Mega 156 : ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రానున్న మెగాస్టార్ మూవీ..?


Mega 156 : ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రానున్న మెగాస్టార్ మూవీ..?

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన కొత్త మూవీ ని ప్రారంభించారు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు.రెండు రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన చిత్రబృందం నటీనటుల ఎంపిక పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ చిత్రం సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మూడు లోకాల చుట్టూ తిరిగే కథ అని సమాచారం.దేవ, మానవ, పాతాళలోకాల్లో ఓ పాప చుట్టూ తిరిగే ఫాంటసీ కథ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ కూడా భారీ స్థాయిలో ఉండనున్నట్లు సమాచారం.. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారట.

ఇక ఇందులో విలన్‌గా రానా దగ్గుబాటిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హీరోయిన్‌గా అనుష్క శెట్టి మరియు మృణాల్‌ ఠాకూర్‌ల పేర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.మూడు దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబో రిపీట్‌ అవుతుంది.అలాగే ఈ సినిమా టైటిల్‌ విషయంలోనూ సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం.శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’కు మొదట ఇదే పేరును పరిశీలించినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఆ కథకు విశ్వంభర సరిపోదని దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఇదే టైటిల్‌ను చిరంజీవి సినిమాకు ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ మెగా 156 మూవీకి సంబంధించిన ఈ వార్తలు మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.