Leading News Portal in Telugu

Master Peace : ఓటీటీ లోకి వచ్చేసిన మాస్టర్ పీస్ వెబ్ సిరీస్..


Master Peace : ఓటీటీ లోకి వచ్చేసిన మాస్టర్ పీస్ వెబ్ సిరీస్..

స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ఈ భామ నటించిన తాజా వెబ్ సిరీస్ మాస్టర్ పీస్ వెబ్‌సిరీస్ ఓటీటీ లో రిలీజైంది. బుధవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మలయాళ వెబ్ సిరీస్ తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడ భాషల్లో అందుబాటు లో ఉన్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఈ సిరీస్‌కు శ్రీజీత్ ఎన్ దర్శకత్వం వహించాడు. షరాఫుద్దీన్‌, రెంజి ఫణిక్కర్‌ మరియు మాల పార్వతి ముఖ్య పాత్ర లను పోషించారు.విభిన్న భావాలు కలిగిన ఓ జంట పెళ్లితో ఒక్కటైన తర్వాత ఏం జరిగిందన్నది వినోదాత్మకంగా ఈ సిరీస్‌లో డైరెక్టర్ శ్రీజీత్ చూపించారు..

ఇందులో రియా అనే పాత్రలో నిత్యామీనన్ నటించింది. నిత్యా తన గత సినిమాలకు, సిరీస్‌లకు భిన్నం గా ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌ తో ఈ సిరీస్‌లో కనిపించింది.అంతే కాకుండా మలయాళంలో నిత్యామీనన్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం..బ్రీత్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ తెలుగులో మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్‌ మరియు శ్రీమతి కుమారి వెబ్‌సిరీస్‌ లలో నటించి మెప్పించింది.శ్రీమతి కుమారి వెబ్‌సిరీస్ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయి మంచి ఆదరణ పొందుతుంది.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్న నిత్యామీనన్ వెబ్‌సిరీస్‌లపై బాగా ఫోకస్ చేస్తుంది.. గత ఏడాది ధనుష్ హీరోగా నటించిన తమిళ చిత్రం తిరు చిత్రాంబళం సినిమాలో హీరోయిన్ గా నటించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నది నిత్యామీనన్‌.ఈ సినిమా దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది.నిత్యా మేనన్ గ్లామర్ పాత్రలకు దూరంగా వుంటూ కథా ప్రాధాన్యత వున్న కథకలకు ఓకే చెబుతుంది. చిన్న హీరో అయినా సరే కథ నచ్చితే ఆ సినిమాకు ఓకే చెబుతుంది.