Leading News Portal in Telugu

Narsimha Nandi: “ప్రభుత్వ సారాయి దుకాణం” పేరుతో సినిమా మొదలెట్టిన నేషనల్ అవార్డ్ డైరెక్టర్


Narsimha Nandi: “ప్రభుత్వ సారాయి దుకాణం” పేరుతో సినిమా మొదలెట్టిన నేషనల్ అవార్డ్ డైరెక్టర్

Prabhutva Sarai Dukanam Movie of Narsimha Nandi started today: 1940లో ఒక గ్రామం పేరుతో సినిమా తెరకెక్కించి బెస్ట్ నేషనల్ అవార్డు అందుకుని ఆ తర్వాత కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఆలోచింప చేసే సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ బ్యానర్ మీద మరో సినిమా మొదలు పెట్టారు. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా అనే పేరుతో తెరకెక్కిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. షేక్ స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగిందని నరసింహ నంది పేర్కొన్నారు.

Charan Raj: పాము లాంటి క్యారెక్టర్ చేశా.. ఇలాంటివయితే ఫ్రీగా నటిస్తా : చరణ్ రాజ్

1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగిందని, పాత కొత్త నటీనటుల కలయికతో నిర్మితమవుతున్న ఈ సినిమాలో అదితి మైకల్, వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పరిగి స్రవంతి మల్లిక్, నరేష్ గౌడ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి వి నాగిరెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా సుక్కు సంగీతం అందిస్తున్నారు. మహి రెడ్డి పండుగల కెమెరామెన్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి నరసింహ నంది దర్శకత్వం వహిస్తూనే కథ కూడా అందించడం గమనార్హం. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న శివాజీ హీరోగా ఒక సినిమాను నరసింహ నంది కొన్నేళ్ల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే ఎందుకో కానీ ఆ సినిమా తెరకెక్క లేదు.