Leading News Portal in Telugu

War 2: ఒక ‘V’ చిత్రం… ఎన్టీఆర్ లేకుండా డూపుతో ఫస్ట్ షెడ్యూల్ లాగేసారా?


War 2: ఒక ‘V’ చిత్రం… ఎన్టీఆర్ లేకుండా డూపుతో ఫస్ట్ షెడ్యూల్ లాగేసారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న సినిమా ‘వార్ 2’. వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ వార్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. వార్ 2 కోసం అయాన్ హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిసి వెళ్లాడు. ఎన్టీఆర్ ని కలిసిన అతి తక్కువ రోజుల్లోనే వార్ 2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిపొయింది. ఫైటర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న హ్రితిక్ రోషన్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయిపోయాడు. ఎన్టీఆర్ దేవర షూటింగ్ కారణంగా వార్ 2 షూటింగ్ అటెండ్ అవ్వలేదు. ఎన్టీఆర్ కూడా ఉండాల్సి రావడంతో అయాన్ ముఖర్జీ వార్ 2 షూటింగ్ ని హ్రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ డూపుతో లాగేసాడట.

స్పెయిన్ లో వారం రోజుల పాటు జరిగిన భారీ ఛేజ్ సీక్వెన్స్ ని కంప్లీట్ చేశాడట అయాన్ ముఖర్జీ. హ్రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ డూపుతో షెడ్యూల్ ని అయాన్ కంప్లీట్ చేసాడు అనే విషయం బయటకి రావడంతో సోషల్ మీడియాలో వార్ 2 ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యి ఉంటే ఈ పాటికి ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలిసి ఉన్న ఒక్క లీక్డ్ పిక్ అయినా బయటకి వచ్చేది. దెబ్బకి సోషల్ మీడియాలో సునామీ వచ్చేది. మరి నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు? వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ ఎప్పుడు జాయిన్ అవుతాడు? ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలిసున్న ఫోటో ఎప్పుడు బయటకి వస్తుంది అనేది చూడాలి.