Leading News Portal in Telugu

Game Changer: జరగండి సాంగ్ కోసం అంత బడ్జట్ పెట్టారా? శంకర్ కి దండం పెట్టాల్సిందే


Game Changer: జరగండి సాంగ్ కోసం అంత బడ్జట్ పెట్టారా? శంకర్ కి దండం పెట్టాల్సిందే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తున్న 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వెళ్లింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2024 ఆగస్టు ని టార్గెట్ చేసేలా ఉంది. 2024 సంక్రాంతికే రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు కానీ షూటింగ్ డిలే అవుతుండడంతో రిలీజ్ వెనక్కి వెళ్తోంది. షూటింగ్ అయితే నెమ్మదిగా అయినా చేస్తున్నారు కానీ గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్స్ మాత్రం బయటకి రావట్లేదు. ఫస్ట్ లుక్ మినహా గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేసారు. జనవరి 26, ఆగస్టు 15, చరణ్ బర్త్ డే, వినాయక చవితి, దసరా… ఇలా ఈవెంట్స్ అయిపోతూనే ఉన్నాయి కానీ గేమ్ ఛేంజర్ నుంచి ఒక్క అప్డేట్ కూడా బయటకి రాలేదు.

అసలు గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనుకుంటున్న సమయంలో దీపావళి ఫెస్టివల్ కి “జరగండి” సాంగ్ ని రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఒక కలర్ ఫుల్ ఫోటోతో సాంగ్ అనౌన్స్మెంట్ బయటకి రావడంతో ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. శంకర్ సినిమాలో సాంగ్స్ చాలా లావిష్ గా ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ లో ఉంటాయి. అందుకే తగ్గట్లే జరగండి సాంగ్ ని కూడా శంకర్… దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టి ఒక సెట్ వేయించాడని… ఆన్ స్క్రీన్ చూసినప్పుడు సెట్ చాలా రియలిస్టిక్ గా ఉంటుందని టాక్. దాదాపు వారం రోజుల పాటు శంషాబాద్ లో వేసిన సెట్ లో ప్రభుదేవా కంపోజ్ చేసిన స్టెప్స్ తో ఈ జరగండి సాంగ్ తెరకెక్కింది. లీక్ అయినప్పుడు నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేసిన సాంగ్… దీపావళికి బయటకి వచ్చి ట్రెండ్ సెట్టర్ అవుతుందేమో చూడాలి.