Leading News Portal in Telugu

Leo Scam: కలెక్షన్స్ ఫేకా? కమల్ కి నచ్చలేదా? థియేటర్ల ఓనర్లకి నష్టాలా? ఏం జరుగుతుంది అసలు?


Leo Scam: కలెక్షన్స్ ఫేకా? కమల్ కి నచ్చలేదా? థియేటర్ల ఓనర్లకి నష్టాలా? ఏం జరుగుతుంది అసలు?

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ మాస్టర్ సినిమాతో ఆడియన్స్ ని బాగా డిజప్పాయింట్ చేసారు. ఈ కాంబినేషన్ ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని లియో సినిమా చేసారు. భారీ బడ్జట్ తో, భారీ స్టార్ కాస్ట్ తో… అంతకన్నా భారీ అంచనాలతో అక్టోబర్ 19న రిలీజ్ అయ్యింది లియో సినిమా. ఓపెనింగ్ డే రోజునే లియో నెగటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజ్, విజయ్ మరోసారి మిస్టేక్ చేసారు… వాళ్ల రేంజ్ సినిమాలు చేయలేదు, అంచనాలని అందుకోలేదు అనే కామెంట్స్ అన్ని సెంటర్స్ నుంచి వినిపిస్తున్నాయి. లియో సినిమా జస్ట్ యావరేజ్ అనే చెప్పాలి కానీ కలెక్షన్స్ మాత్రం ఫైర్ మోడ్ లో ఉన్నాయి. ఈ కలెక్షన్స్ ఎక్కువ ఉండడమే ఇప్పుడు లియోపై వచ్చే విమర్శలకి కారణం అయ్యింది. లియో సినిమా మొదటిరోజు 148 కోట్లు రాబట్టింది అంటూ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. లేటెస్ట్ గా లియో సినిమా మొదటివారానికే 500 కోట్ల క్లబ్ లో చేరింది అంటూ కొందరు ట్వీట్స్ చేస్తున్నారు. మొదటిరోజు కేవలం నాలుగు వేల స్క్రీన్స్ తో లియో సినిమాకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి అనే దగ్గర చర్చ మొదలయ్యింది.

అక్టోబర్ 23న దసరా ఫెస్టివల్ తర్వాత లియో సినిమా అన్ని సెంటర్స్ లో బాగా సైలెంట్ అయ్యింది, కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? ఇది ప్రాక్సీ బుకింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి. దాదాపు 120 కోట్లు ఖర్చు పెట్టి లియో సినిమా బుకింగ్స్ ని ప్రాక్సీ బుకింగ్స్ ని చేసారు. అందుకే వచ్చే కలెక్షన్స్ లో నిజం లేదు, ఒకవేళ నిజంగానే లియో సినిమా అంత పెద్ద హిట్ అయ్యి ఉంటే కమల్ హాసన్… తన ఫ్యాన్ లోకేష్ కనగరాజ్ ఇండస్ట్రీ హిట్ కొడితే ఒక్క ట్వీట్ కూడా వేయకుండా ఉంటాడా అనే ప్రశ్నని లేవనెత్తుతున్నారు. ఇది చాలదన్నట్లు తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ హెడ్ తిరుపూర్ సుబ్రమణి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో “లియో సినిమా మాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సినిమా సమయంలో ఇంకో మూవీ రిలీజ్ కి ఉన్నా బాగుండేది దాన్ని తీసుకునే వాళ్లం. ప్రొడ్యూసర్ 80% షేర్ అడుగుతున్నాడు, అంత ప్రొడ్యూసర్ కి ఇస్తే థియేటర్స్ బ్రతకవు. కలెక్షన్స్ చాలా వీక్ గా ఉన్నాయి” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. స్వయంగా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ హెడ్ యే ఇలాంటి కామెంట్స్ చేసే సరికి లియో కలెక్షన్స్ ఫేక్ అనే మాట మరింత ఎక్కువగా వినిపిస్తోంది. ప్రొడ్యూసర్స్ లియో సినిమాని ఇండస్ట్రీ హిట్ అని ప్రూవ్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని టాక్. ఈ కారణంగా #LeoScam #LeoDisaster అనే ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు.