
Malavaika Mohanan: మాస్టర్ సినిమాతో తెలుగు వారికీ కూడా సుపరిచితంగా మారింది కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత అమ్మడికి వరుస అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. స్టార్ హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ మొత్తం అమ్మడి పైనే దృష్టి పెట్టాయి. అందుకు కారణం.. రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ లో ప్రభాస్ సరసన రాజా డీలక్స్ లో మాళవిక హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెది మొట్ట మొదటి సినిమా.. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇది కనుక హిట్ అయితే అమ్మడి రేంజ్ .. ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక కోలీవుడ్ లో తంగలాన్ చిత్రంలో నటిస్తోంది. విక్రమ్ నటిస్తున్న ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా హిట్ అయినా కూడా మాళవిక స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Malti Sharma: హీరోయిన్ అవుదామని వచ్చి బిచ్చం ఎత్తి, అరెస్టయి!
ఇక సినిమాలు పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఈ భామ చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తో ఫోటోషూట్స్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య హీరోయిన్స్ అందరూ.. నీళ్లలో ఫోటోషూట్ చేస్తున్నారు. వైట్ కలర్ చీరలు కట్టుకొని తడి అందాలతో సెగలు పుట్టిస్తున్నారు. తాజాగా మాళవిక కూడా ఆ ట్రెండ్ ను కొనసాగించింది.తెల్లని చీర కట్టుకొని.. నదిలో దిగి జలకాలాడుతూ కనిపించింద. ముఖ్యంగా ఆ నడుము చూపించి కుర్రకారును ఫిదా చేసింది. ఇక ఆ రేంజ్ లో అమ్మడు చుపించాకా ఫ్యాన్స్ ఆగుతారా.. నీ నడుము మడతల్లో నను మడతపెట్టావే అంటూ పాట మొదలెట్టేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ భామ ఆ రెండు సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.