Leading News Portal in Telugu

Jawan: 50 రోజులు అంటే.. మాములు విషయం కాదు బాసూ



Jawan

Jawan: ప్రస్తుతం ఉన్న చిత్ర పరిశ్రమలో ఎంత పెద్ద సినిమా అయినా దాదాపు నెలరోజులు కంటే ఎక్కువ థియేటర్ లో ఉండడం లేదు. మహా అయితే నెలా 15 రోజులు.. అంతే. అప్పట్లో ఒక సినిమా హిట్ అయ్యింది అంటే థియేటర్ లోనే 100 రోజులు పూర్తిచేసుకొనేది. అర్ద శతదినోత్సవం.. శతదినోత్సవం అంటూ ఎన్నో వేడుకలు కూడా జరుపుతూ ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ హడావిడి లేదు. సినిమా వచ్చిన వారం రోజులోనే ఒక సక్సెస్ మీట్ పెట్టామా.. ? కొన్నిరోజులు ఓటిటీలోకి వచ్చిందా.. ? ఇక అంతే.. ప్రస్తుత పరిస్థితి అలానే ఉంది. ఇక ఇలాంటి సమయంలో కూడా ఒక సినిమా 50 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకుంది. అదే.. జవాన్. షారుఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, దీపికా పదుకొనే క్యామియోలో కనిపించి మెప్పించారు.

Malavaika Mohanan: నీ నడుము మడతలతో.. కుర్రకారును మడతపెట్టేశావే

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7 న రిలీజ్ అయ్యి.. నేటితో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా అత్యధిక కలక్షన్స్ రాబట్టి షేక్ చేస్తోంది. 50 వరోజు కూడా రూ.11 లక్షలు రాబట్టింది. ఇక 50 రోజులకు కాను.. దాదాపు రూ. 1145 కోట్లు దాటి వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక జవాన్ 50 రోజులు పూర్తిచేసుకోవడంతో అట్లీ.. ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి ” 50 రోజులు గడిచినా ఇప్పటికీ మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్న జవాన్ ప్రపంచంలోని ప్రతి మూలను శాసిస్తున్నాడు” అని రాసుకొచ్చాడు. మరి జవాన్ ఇంకెన్ని రోజులు తన సత్తా చాటుతాడో చూడాలి.