Leading News Portal in Telugu

Megha Akash: మేఘా ఆకాష్ పుట్టినరోజు.. సఃకుటుంబనాం సెట్స్ లో ఘనంగా వేడుకలు !!!


Megha Akash: మేఘా ఆకాష్ పుట్టినరోజు.. సఃకుటుంబనాం సెట్స్ లో ఘనంగా వేడుకలు  !!!

Megha Akash Birthday Celebrations: రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న సఃకుటుంబ‌నాం సినిమా షూట్ లో బిజీగా ఉంది. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది.
Megha Akash Birthday
ఇక ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెట్స్ లో హీరోయిన్ మేఘా ఆకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
Megha Akash Birthday1
ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌లో హీరో రామ్‌ కిర‌ణ్‌, డైరెక్ట‌ర్ ఉద‌య్‌ శ‌ర్మ తో పాటు సినిమా యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న సఃకుటుంబనాం సినిమాను హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ బ్యానర్ పై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం నిర్మిస్తున్నారు.
Megha Akash Birthday2
ఇక ఈ సినిమాలో రాజేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ, ర‌చ్చ‌ర‌వి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అనంత్ శ్రీ‌రామ్‌ పాట‌లు అందిస్తున్నారు.
Megha Akash Birthday3