Leading News Portal in Telugu

Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు మొదటి వారం కలెక్షన్స్ ఎంతో తెలుసా..?


Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు మొదటి వారం కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’..అక్టోబర్ 20న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే పండగకి విడుదల అయిన మిగిలిన చిత్రాల పోటీ వల్ల కాస్త నెమ్మదిగానే ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు జోరు పెంచాడు..రన్ టైమ్ తగ్గించిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు వసూళ్లలో వేగం పెరిగింది.. కాగా, టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలి వారం వసూళ్ల గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్‍లో ఎన్ని కోట్ల వసూళ్లు చేసిందో నేడు (అక్టోబర్ 27) వెల్లడించారు.టైగర్ నాగేశ్వరరావు సినిమాకు తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.50కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఈ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ ఆర్ట్స్ అగర్వాల్ బ్యానర్ ఓ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ.50కోట్ల మార్కును టైగర్ నాగేశ్వరరావు దాటిందని పేర్కొన్నారు.. రెండో వారం కూడా మంచి ప్రేక్షకాదరణతో ఈ సినిమా కొనసాగుతోందని రాసుకొచ్చింది.టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రతీ రోజు కలెక్షన్లు ఎంత వస్తున్నాయనే విషయాన్ని కూడా మేకర్స్ వెల్లడించలేదు. భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయని, తొలి రోజు కంటే ఎక్కువ కలెక్షన్స్ అంటూ పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు వారం తొలి వారం ముగిసిన సందర్భంగా రూ.50కోట్లకు పైగా కలెక్షన్ల అంటూ అధికారికంగా లెక్కను వెల్లడించింది.

1970 దశకంలో దేశంలోనే అతిపెద్ద దొంగగా చలామణి అయిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. టైగర్ నాగేశ్వరరావు పాత్రలో మాస్ రాజా రవితేజ అద్భుతంగా నటించారు. యువ డైరెక్టర్ వంశీ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నుపుర్ సనన్ మరియు గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిస్సు సెంగుప్త, మురళీ శర్మ, హరీశ్ పెద్ది మరియు సుదేవ్ నాయర్ ముఖ్య పాత్రలు పోషించారు.టైగర్ నాగేశ్వరరావు చిత్రం ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునేలా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ నిడివి ఎక్కువగా ఉందనే వాదనలు ఆరంభంలో వినిపించాయి. రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్ అయిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. దీంతో వెంటనే తేరుకున్న మేకర్స్ ఈ సినిమా రన్ టైమ్‍ను సుమారు అరగంట వరకు తగ్గించారు. 2 గంటల 37 నిమిషాలకు ఈ చిత్రం రన్ టైమ్ తగ్గించారు. ఆ తర్వాతి నుంచి టాక్ కూడా మెరుగ్గా వస్తున్నట్టు సమాచారం.టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.