Leading News Portal in Telugu

Sapta Sagaradaache Ello (Side B) : సప్త సాగరాలు దాటి సైడ్ బి టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్..


Sapta Sagaradaache Ello (Side B) : సప్త సాగరాలు దాటి సైడ్ బి టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్..

ప్రస్తుతం కన్నడ సినిమాలు అన్ని ఇండస్ట్రీ లలో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతున్నాయి… కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్‌ రోణ వంటి కంటెంట్ ఉన్న కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో ఈ ఏడాది మరో సినిమా తెలుగులో అద్భుత విజయం సాధించింది.ఆ సినిమానే సప్త సాగరదాచే ఎల్లో సైడ్‌-ఏ.. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు.. అలాగే రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను సప్త సాగరాలు దాటి అనే పేరుతో తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేయగా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇది కేవలం తొలిపార్టు మాత్రమే. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా..

మేకర్స్ ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.మేకర్స్ సప్త సాగరాలు దాటి సైడ్‌-బీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కట్ చేయగా.. గాడిద.. అంటూ టీజర్ మొదలవుతుంది. ప్రియ (రుక్మిణి) మాట్లాడుతూ మను (రక్షిత్ శెట్టి) నువ్వు జైలు నుంచి వచ్చాక నేను పెద్ద సెలబ్రేషన్ ప్లాన్ చేశా. ఇంటిని మొత్తం డెకరేట్ చేశాను. ఈ వినోద్ గాడు టెంట్ వేసి లైటింగ్ పెడాదం అంటున్నాడు. నేను సిగ్గుతో నువ్వు మళ్లీ జైలుకే పోతావు అని చేప్పాను. నీకు మా అమ్మ వండిన చేపల కూర అంటే ఇష్టం కాదా. నీకోసం అది నేర్చుకుంటున్నా. అలాగే నీకోసం సజ్జీగా స్వీట్ చేస్తా ఈ స్పెషల్ ట్రీట్‌మెంట్ అంతా కొన్ని రోజులు మాత్రమే అంటూ టీజర్ సాగింది. ఇక టీజర్ చూస్తే  మను జైలు నుంచి వచ్చిన తరువాత అస్సలు ఏం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది.ఇక ఈ రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్‌-బీ నవంబర్ 17న కన్నడతో పాటు మరో మూడు భాషల్లో విడుదల కానుంది.