Leading News Portal in Telugu

Pawan Kalyan : వరుణ్ పెళ్లి కోసం ఇటలీ బయలుదేరిన పవన్ కళ్యాణ్ దంపతులు.. ఫోటోలు వైరల్..


Pawan Kalyan : వరుణ్ పెళ్లి కోసం ఇటలీ బయలుదేరిన పవన్ కళ్యాణ్ దంపతులు.. ఫోటోలు వైరల్..

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా లావణ్య-వరుణ్ జంటగా ఇటలీకి పయనమయ్యారు..నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. మిస్టర్ చిత్ర షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్, లావణ్య మొదట కలుసుకుంది ఇటలీలోనే. అందుకే సెంటిమెంట్ గా మ్యారేజ్ వెన్యూని కూడా అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి.. ఇక వీరిద్దరి వివాహం మాత్రం మిగిలి ఉంది..

ఇటలీలో వివాహం కావడంతో మూడు రోజుల ముందుగానే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అక్కడికి వెళ్లారు. నాగబాబు కుటుంబ సభ్యులంతా ఇటలీ చేరుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఒక్కొక్కరు ఇటలీ వెళుతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన భార్య అన్నా లెజినోవాతో కలసి సతీసమేతంగా ఇటలీ బయలుదేరారు..ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ వెళుతున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. అన్నా లెజినోవా మీడియాకి కనిపించడం, పబ్లిక్ లో తిరగడం చాలా తక్కువ. దీనితో పవన్, లెజినోవా కనిపించడంతో కెమెరా కంటికి చిక్కారు.. ఈ ఫోటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు..

ఇటలీలో పెళ్లి జరిగిన తర్వాత నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ వేడుక జరగనుంది. దీనితో రిసెప్షన్ కి సంబందించిన ఇన్విటేషన్ శుభలేఖలని అతిథులందరికి పంచుతున్నారు. శుభలేఖకి సంబందించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి.. ఆ వెడ్డింగ్ కార్డు ఫోటోలు కూడా తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే..