
తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’ ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.. టైటిల్ ద్వారానే ఈ చిత్రానికి ఆరంభం నుంచి ఫుల్ బజ్ ఏర్పడింది.ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. క్రైమ్ కామెడీ మూవీగా రూపొందుతున్న ‘జపాన్’ సినిమాలో దొంగ పాత్రను కార్తీ పోషించారు. రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, జపాన్ సినిమా ట్రైలర్ నేడు (అక్టోబర్ 28) రిలీజ్ అయింది. ఈ సినిమాలో జపాన్ అనే గజదొంగ పాత్రను కార్తీ పోషించారు. సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తీ) చిన్నప్పుడే తన తల్లి కోసం దొంగగా మారినట్టు ట్రైలర్ ఆరంభంలో ఉంది. “బుల్లి చేప.. అమ్మ చేప కోసం కన్నం వేసింది. అక్కడ మొదలైంది బుల్లి చేప వేట” అంటూ కార్తీ వాయిస్ ఓవర్ క్రేజీ గా ఉంది. చిన్నప్పుడే దొంగగా మారిన జపాన్.. ఆ తర్వాత గజదొంగ గా మారతాడు. “ఆ బుల్లి చేప తిమింగలం అయింది” అనే డైలాగ్ కూడా ఉంది. తన దొంగతనాలతో పోలీసులు, ప్రభుత్వంలో జపాన్ అలజడి సృష్టిస్తాడని ట్రైలర్లో చూపిస్తారు.. జపాన్ను పట్టుకునేందుకు పోలీసులు, ఇతర దొంగలు ఇలా చాలా మంది ప్రయత్నిస్తారు.
అయితే.. “సొరచేపలు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా తిమింగలం వలలో పడదుగా” అంటూ జపాన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.. తాను తిమింగలం అని, ఎవరూ పట్టుకోలేరని జపాన్ అంటుంటారు. హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ కూడా ట్రైలర్లో కనిపించింది.. సునీల్ సరికొత్త గెటప్ లో కనిపించారు.ముఖ్యంగా కార్తీ డైలాగ్ డెలివరీ ఈ ట్రైలర్లో ఎంతో డిఫరెంట్గా ఉంది. కామెడీగా ఉంటూనే చాలా ఆసక్తికరంగా ఈ ట్రైలర్ సాగింది. ట్రైలర్ లో కార్తీ డైలాగ్స్ హైలైట్గా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు, తమిళంలో ట్రైలర్ విడుదల అయింది.. జపాన్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో విభిన్నంగా, ఆకట్టుకునేలా సాగింది. కార్తీ మరోసారి తన యాక్టింగ్తో అదరగొట్టారు.జపాన్ సినిమా దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ పేర్కొంది. అయితే, తేదీని ఇంకా కచ్చితంగా ప్రకటించలేదు. అతిత్వరలోనే రిలీజ్ డేట్ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. జపాన్ సినిమా ను డ్రీమ్ వారియర్స్ పిక్చర్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.