Leading News Portal in Telugu

Maa Oori Polimer 2 : ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..


Maa Oori Polimer 2 : ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

సత్యం రాజేశ్‌, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2 డాక్టర్ అనిల్‌ విశ్వనాథ్‌ డైరెక్షన్‌ లో వస్తున్న ఈ హార్రర్ థ్రిల్లర్‌ మూవీ నవంబర్ 3 న గ్రాండ్‌ గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.. ఈ సినిమా మా ఊరి పొలిమేర పార్టు 1కు కొనసాగింపుగా వస్తోంది..విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్‌ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అప్‌డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో రేపు సాయంత్రం 06:30 గంటలకు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు తెలియజేశారు మేకర్స్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన నయా పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మా ఊరి పొలిమేర 2లో గెటప్‌ శీను, రాకేందు మౌళి, సాహిత్య దాసరి మరియు రవివర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా రీసెంట్‌గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది…డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియాలోనే ఎక్కువగా వీక్షించిన రెండో ట్రైలర్‌గా మా ఊరి పొలిమేర 2 అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. పల్లెటూరి నేపథ్యంలో చేతబడి (బ్లాక్ మ్యాజిక్‌) చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సీక్వెల్ తో డబుల్ థ్రిల్‌ అందించబోతున్నట్టు టీజర్‌, ట్రైలర్‌ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు.. సమాజంలో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. మా ఊరి పొలిమేర 2 సినిమాను పాడేరు, కేరళ, ఉత్తరాఖండ్‌లో షూటింగ్ చేసినట్లు సమాచారం..ఇదిలా ఈ సినిమాకు మూడవ పార్ట్ కూడా ఉండనున్నట్లు ఈ చిత్ర దర్శకుడు వెల్లడించారు.అయితే మూడవ పార్ట్ లో స్టార్ హీరోలు నటించనున్నట్లు దర్శకుడు తెలిపారు.

https://twitter.com/shreyasgroup/status/1718581777575678448?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1718581777575678448%7Ctwgr%5Eb767719b7cdd7fedfcd0e373e07de7adad2e3bcf%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F