Leading News Portal in Telugu

Pragathi: అతనితో రెండో పెళ్లి.. ఎవడ్రా చెప్పింది.. చీప్ రాతలు రాయకండి



Pragathi

Pragathi: నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి మెప్పించింది. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా తన సత్తా చాటుతూ ఉంటుంది. తల్లి, అత్తగా చేస్తే.. బయటకూడా అలాగే ఉండాలా.. ? ఏంటి అంటూ ట్రెండీ అవుట్ ఫిట్ తో.. జిమ్ లో కసరత్తులు చేస్తూ కుర్రకారును తనదైన రీతిలో అలరిస్తూ ఉంటుంది. ఇక గత కొంతకాలంగా సినిమాలలో తక్కువ కనిపిస్తున్న ప్రగతి ఈ మధ్యనే సీరియల్స్ లో కూడా నటించడం మొదలుపెట్టింది. ఇక సెలబ్రిటీలు అన్నాక సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ప్రగతి మీద కూడా ఒక రూమర్ వచ్చింది. గత కొంత కాలంగా ప్రగతి .. ఒక నిర్మాతతో ప్రేమలో ఉందని, త్వరలోనే ఆ నిర్మాతను పెళ్లి చేసుకుంటుందని ఒక వెబ్ సైట్ రాసుకొచ్చింది. దాంతో ఇది నిజమేనా అని నెటిజన్లు.. ప్రగతిని అడగడంతో.. ఈ విషయం కాస్తా ప్రగతి వరకు వెళ్ళింది. ఆమె ఈ విషయాన్నీ ఖండించడంతో పాటు సదురు వెబ్ సైట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Suriya: ఢిల్లీ ఎప్పుడు వస్తాడో.. రోలెక్స్ కూడా తిరిగి వస్తాడు

“నేను ఆ వార్తను ఖండిస్తున్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్ ను పప్రింట్ చేసినా ఆ వెబ్ సైట్ పై ఒకప్పుడు నాకు చాలా గౌరవం ఉండేది. అసలు అందులో నిజం ఎంత అనేది తెలియకుండా ఎలా రాస్తారు. ఒక సంస్థ ను నడుపుతున్నవాళ్ళు.. వాళ్లలో ఎంతంనుండి చదువుకున్నవారు ఉంటారు .. మంచి కుటుంబం నుంచి వచ్చినవారుంటారు. ఒక మంచి కమ్యూనిటీ నుంచో ఒక వార్త పెడుతున్నారు అంటే.. అది ఎంత నిజం అయ్యి ఉండాలి. ఇలా బేస్ లెస్ గా .. నేనొక ఒక నటిని కాబట్టి.. ఎలాంటి ఆధారం లేకుండా ఫేక్ న్యూస్ ను ప్రింట్ చేసి.. వదిలేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకరి పర్సనల్ లైఫ్ లోకి వచ్చి.. ఇలాంటి వార్తలు రాయడానికి మీకేం హక్కు ఉంది.. ? ఒకవేళ ఆధారాలు ఉండి.. మీరు మాట్లాడితే పర్వాలేదు.. అసలేమీ లేకుండా.. ఎవడో కలగన్నాడా.. ? ఏదో అనుకున్నాడా.. ? అని రాసేశారు. ఈ వార్తను నేను ఖండిస్తున్నాను. ఇకనుంచి అయినా.. కొంత హోమ్ వర్క్ చేయండి.. ఏది నిజం .. ? ఏది అబద్దం ..? అని తెలుసుకొని రాస్తే బావుంటుంది. ఇలాంటి వార్తలు రాసి సంస్థను చీప్ గా చేయకండి. ఇది చాలా చీప్ గా అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.