Leading News Portal in Telugu

Mrunal Thakur: మృణాల్ కూడా హైదరాబాద్ కోడలే.. ఇదే సాక్ష్యం


Mrunal Thakur: మృణాల్ కూడా హైదరాబాద్ కోడలే.. ఇదే సాక్ష్యం

Mrunal Thakur: ఓ సీతా.. అంటూ తెలుగు కుర్రకారును తన అందంతో కట్టిపడేసిన భామ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమా తరువాత మృణాల్ ను సీతగానే పలకరిస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తరువాత టాలీవుడ్ అంతా మృణాల్ వైపే చూసింది. ఒక్క సినిమాతో అమ్మడు అన్ని అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఈ మధ్యనే సైమా అవార్డుల్లో బెస్ట్ హీరోయిన్ గా అవార్డును గెలుచుకుంది. ఇక ఈ వేదికపైనే మృణాల్.. నిర్మాత అల్లు అరవింద్ ఆశీర్వాదాలు అందుకుంది. టాలీవుడ్ బడా నిర్మాత అయిన అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ల పెళ్లి విషయంలో అల్లు అరవింద్ చెప్పింది చెప్పినట్లుగా జరగడంతో అభిమానులు ఆయనను జ్యోతిష్కుడు అని పిలిచేస్తున్నారు. గతంలో ఒక వేదికపై లావణ్య త్రిపాఠిని పొగుడుతూ.. హైదరాబాద్ కోడలు అవ్వాలి అని ఆశీర్వదించాడు. ఇంకేం ఉంది.. చివరకు లావణ్య.. మెగా ఇంటి కోడలే అయిపోయింది.

Poliemera 2: ముందు మేమే.. మా తరువాతే కాంతార, విరూపాక్ష..

ఇక ఇప్పుడు అదే విధంగా.. మృణాల్ ను కూడా అల్లు అరవింద్ హైదరాబాద్ వచ్చేయ్ అమ్మా .. అంటూ ఆశీర్వదించాడు. ఒకప్పుడు నేను ఒక హీరోయిన్ ను బ్లెస్స్ చేశాను.. ఆమె ఒక హీరోను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. నువ్వు కూడా హైదరాబాద్ రావాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో మృణాల్ కూడా త్వరలోనే టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడుతుందని అభిమానులు జోస్యం చెప్పుకొచ్చేస్తున్నారు. మరి ఈ భామ టాలీవుడ్ లో ఏ హీరోతో రొమాన్స్ నడుపుతుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం ఈ చిన్నది హయ్ నాన్న సినిమాలో నాని సరసన నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.