
Thalaivar 170: జైలర్ తరువాత రజినీకాంత్ జోరు పెంచేశాడు. ప్రస్తుతం రజినీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తలైవర్ 170. జైభీమ్ దర్శకుడు టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అన్ని భాషలకు సంబంధించిన స్టార్ నటులు నటిస్తున్నారు. తెలుగు నుంచి రానా దగ్గుబాటి, మళయాళం నుంచి ఫహాద్ ఫాజిల్.. హిందీ నుంచి అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు.
Priyanka Mohan: ఆ హీరో.. తరుచూ ఆ పని చేయమని ఒత్తిడి చేస్తాడు
బిగ్ బి అమితాబ్ బచ్చన్ , రజినీకాంత్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. తలైవర్ 170 సెట్స్ లో షెహంషా అమితాబ్ బచ్చన్ కలిసిన వేళ.. 33 ఏళ్ల తరువాత ఈ అరుదైన కలయిక. తలైవర్ 170 డబుల్ డోస్.. ముంబై లో షెడ్యూల్ పూర్తయ్యింది అంటూ రాసుకొచ్చారు. ఈ ఫొటోలో కుర్చీలో అమితాబ్ కూర్చొని ఫోన్ చూస్తుండగా.. రజిని నిలబడి ఆయనను హత్తుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక దాదాపు 33 ఏళ్ల క్రితం గెరాఫ్తార్ అనే సినిమాలో రజినీ, అమితాబ్, కమల్ నటించారు. ఈసినిమా తరువాత ఇప్పుడే మరోసారి రజినీ, అమితాబ్ కలవడం.. అందుకే ఈ అరుదైన కాంబోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు దిగ్గజాలను చూసి అభిమానులు వావ్ అంటున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.