
Priyanka Mohan: గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక మోహన్. మొదటి సినిమాతోనే అమ్మడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత శ్రీకారం అనే సినిమాలో మెరిసిన ఈ బ్యూటీకి విజయం మాత్రం దక్కలేదు. ఇక కోలీవుడ్ లో ఈ భామ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలా హిట్లు అందుకొనే.. డైరెక్టర్ సుజిత్ కంట్లో పడింది. అంతే.. పవన్ కళ్యాణ్ OG లో ఛాన్స్ పట్టేసింది. అంతేకాకుండా నానితో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తోంది.ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అయితే సన్నజాజి తీగలా సన్నగా ఉండే ఈ భామ ఈ మధ్య చబ్బీ లుక్ తో కనిపించింది. దీంతో మీడియా ఊరుకుంటుందా.. అరే.. ప్రియాంక కొద్దిగా బరువు పెరిగింది ఎందుకో అని కామెంట్స్ చేసింది. దీనికి ఈ భామ.. తెలివిగా.. తానూ బరువు పెరగడానికి కారణం ఇదే అని చెప్పకనే చెప్పుకొచ్చింది.
Hanuman: ఇది మాములు రికార్డ్ కాదు.. ఈ రికార్డ్ ను ఎవరు టచ్ కూడా చేయలేరు
అదేంటంటే.. హీరో శివ కార్తికేయన్ చేసిన పని వలనే తాను బరువు పెరిగినట్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. వీరిద్దరి కాంబోలో డాన్, డాక్టర్ సినిమాలు వచ్చాయి. మొదటి నుంచి కూడా శివ కార్తికేయన్ కు స్వీట్స్ అంటే పిచ్చి అంట. సెట్ లోకి వచ్చేటప్పుడు ఇంట్లో చేసిన స్వీట్స్ అన్ని తీసుకొచ్చి.. తాను తినడమే కాకుండా పక్కన ఉన్నవారికి కూడా తినిపించి చంపేస్తాడట. తరుచూ స్వీట్స్ తినమని ఒత్తిడి చేస్తారని, అందుకే తినక తప్పలేదని, దానివల్లనే బరువు పెరిగినట్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా శివ కార్తికేయన్ చాలా మంచి వ్యక్తి అని, హీరో అనే ఫీల్ అస్సలు ఉండదని స్వీట్లు తినే సమయంలో హీరో అనే విషయం ఆయన మర్చిపోతారని చెప్పుకొచ్చింది. దీంతో ఆ స్వీట్లు వలనే ఈ భామ బరువు పెరిగిందా.. ? అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. మార్ ఈ సినిమాలతో ఈ భామ ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.