Leading News Portal in Telugu

Jabardasth Rakesh: కేసీఆర్ పై సినిమా.. నన్ను మోసం చేశారు.. ఇల్లు, కారు అమ్ముకొని


Jabardasth Rakesh: కేసీఆర్ పై సినిమా.. నన్ను మోసం చేశారు.. ఇల్లు, కారు అమ్ముకొని

Jabardasth Rakesh: జబర్దస్త్ ద్వారా పేరుతెచ్చుకున్న వారందరు.. ఒక్కొక్కరిగా వెండితెర మీదకు వస్తున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా మారాడు. గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర కమెడియన్స్ గా రాణిస్తున్నారు. ఈ మధ్యనే వేణు డైరెక్టర్ గా మారి హిట్ అందుకున్నాడు. త్వరలోనే ధనరాజ్ డైరెక్టర్ గా మారుతున్నాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ రాకేష్ సైతం నిర్మాతగా మారాడు. అతనే హీరోగా.. గరుడవేగ అంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కేసీఆర్. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను రాకేష్ రిలీజ్ చేసాడు. కేసీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాను తీస్తున్నట్లు తెలిపాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం ఆయన పడిన కటం గురించి వివరించాడు.

Mrunal Thakur: మృణాల్ కూడా హైదరాబాద్ కోడలే.. ఇదే సాక్ష్యం

” నాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన జీవిత కథను ఆధారంగా చేసుకోని ఈ సినిమను తీశాను. సినిమా అంటే కొన్ని కోట్లతో కూడుకున్న పని నాకూ తెలుసు. దాని కోసం నేను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లును తాకట్టు పెట్టాను. సినిమా నిర్మిస్తున్నా అనగానే బినామీ డబ్బులతో నిర్మిస్తున్నా అంటూ వార్తలు వచ్చాయి. ఇది నా కష్టంతో తీస్తున్న సినిమా. మొదట కొందరు వ్యక్తులు ఈ సినిమను నిర్మించడానికి ముందుకు వచ్చారు. కానీ, వాళ్లు వెనక్కి తగ్గడంతోనే ప్రొడ్యూసర్ కావాల్సి వచ్చింది. ఎవరు దొరక్క.. చివరికి నేనే నిర్మాతగా మారాను. అలానే ఓ రైటర్ మోసం చేయడం వల్ల సినిమా మొదలు కావడానికి ముందే కారు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ సినిమా నిర్మాణం గురించి తెలిసి అమ్మతో పాటు భార్య సుజాత నన్ను ఎంకరేజ్ చేశారు. సుజాత తన బ్యాంక్ లో ఉన్న డబ్బు, నగలు అన్ని ఇచ్చింది. అంతేకాకుండా.. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యాస్టూమ్ డిజైనర్ గా ఇలా అన్ని పనులు తనే చేసింది. ఇందులో నటి సత్యకృష్ణ కూతురు అన‌న్య తొలిసారిగా నటిస్తోంది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో రాకేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.