
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు..పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ . ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే హంగ్రీ చీతా హ్యాష్ టాగ్ తో ఓజీ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది..ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించునున్నారు. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ వెంకట్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు..ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూలో ఓజీ గురించి మాట్లాడాడు. ఓజీలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని వెంకట్ చెప్పారు..
సినిమా గురించి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను.. అలా చెప్తే సుజిత్ నన్ను చంపేస్తాడు. ఎందుకంటే ఓజీ సినిమా హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతుంది.టాలెంటెడ్ యాక్టర్లు నటిస్తున్న ఓజీ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో భారీ సినిమా కాబోతుంది.. గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ అదరగొట్టేశాడు.. విజువల్స్ కూడా సూపర్ అనిపించేలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు వెంకట్.గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ ఓవైపు వారియర్‌గా.. మరోవైపు స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.. అలాగే ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా వున్నారు.. పవన్ కల్యాణ్ మరోవైపు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.. ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.