Leading News Portal in Telugu

Anukunnavanni Jaragavu Konni: జీవితంలో ఎన్నో అనుకుంటాం కానీ కొన్నే జరుగుతాయి!


Anukunnavanni Jaragavu Konni: జీవితంలో ఎన్నో అనుకుంటాం కానీ కొన్నే జరుగుతాయి!

Anukunnavanni Jaragavu Konni Trailer Launched: శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘అనుకున్నవన్ని జరగవు కొన్ని’, శ్రీభారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తుండగా నవంబర్ 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ అనంతరం మీడియాతో మాట్లాడారు. హీరో శ్రీరామ్‌ నిమ్మల మాట్లాడుతూ కథ అంతా రెడీ చేసుకుని సినిమా తీయడానికి నిర్మాత కోసం వెతుకుతున్న తరుణంలో నేనే ప్రొడ్యూస్‌ చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించా, అమ్మానాన్నలకు చెప్పగా వాళ్లు సపోర్ట్‌ చేసి డబ్బు పెట్టారని అన్నారు. అందువల్లే ఈ సినిమా పూర్తయింది, అయితే దగ్గరుండి ఈ సినిమా పూర్తి చేయాలంటే నాకో మనిషి కావాలి నాకు బాగా తెలిసిన నవీన్ కి విషయం మొత్తం చెప్పగా ఆయన నాతో ట్రావెల్‌ చేశారు, ప్రొడక్షన నుంచి క్యాస్టింగ్‌ వరకూ అన్నీ చూసుకున్నారు.

Nag Ashwin: వీఎఫ్‌ఎక్స్ కంపెనీల చుట్టూ కథలు పట్టుకుని తిరిగా.. నాగ్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు!

అలాగే హరి కూడా ఎంతో సపోర్ట్‌ చేశారు, నా చుట్టూ ఉన్న సన్నిహితుల వల్లే ఇక్కడి వరకూ రాగలిగా, నా టీమ్‌ అంతా ఎంతో సహకరించారని అన్నారు. హీరోయిన్ మౌనిక కలపాల మాట్లాడుతూ ఏ నటికైనా ఓ సినిమా హిట్టై పేరొచ్చాక అవకాశాలు వాటంతట అవే వస్తాయి కానీ కెరీర్‌ బిగినింగ్‌లో ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చినవారే గురువులుగా నిలుస్తారని నా మొదటి దర్శకుడు రామరాజు, ఇప్పుడు సందీప్‌ నాకు అలా అవకాశాలిచ్చారని అన్నారు. నా మొదటి సినిమా లాక్‌డౌన్ వల్ల థియేటర్‌లో విడుదల కాలేదు. ఈ సినిమా విడుదల అవుతున్నందుకు ఆనందంగా ఉంది, అన్ని వర్గాల ప్రేక్షకుల ఈ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. కిరీటి దామరాజు మాట్లాడుతూ ఈ సినిమాలో నేనూ ఓ పాత్ర పోషించా, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవే ఈ చిత్రంలో చూపించారని అన్నారు. మన జీవితంలో ఎన్నో అనుకుంటాం కానీ కొన్నే జరుగుతాయి అదే ఈ సినిమా.