Leading News Portal in Telugu

Thangalaan : తంగలాన్‌ టీజర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్…


Thangalaan : తంగలాన్‌ టీజర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్…

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్.పా రంజిత్ డైరెక్షన్‌ లో అడ్వెంచరస్‌ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2024 రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికే తంగలాన్‌ సినిమా నుంచి విడుదల అయిన గ్లింప్స్‌తోపాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తంగలాన్ టీజర్‌ను నవంబర్‌ 1 న లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.తాజాగా తంగలాన్‌ టీజర్‌ నవంబర్‌ 1న సాయంత్రం 7 గంటలకు మీ ముందుకు రాబోతుంది. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అంటూ మేకర్స్ విక్రమ్ కొత్త లుక్‌ ను షేర్ చేశారు. విక్రమ్‌ తన సైన్యంతో సమరానికి వెళ్తున్నట్టు ఉన్న స్టిల్‌ గూస్‌బంప్స్‌ తెప్సిస్తోంది.

ఈ చిత్రంలో మాళవికా మోహనన్‌ మరియు పార్వతి తిరువొత్తు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ మరియు నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్ నుంచి ఇప్పటికే మాళవికా మోహనన్‌ లుక్‌ విడుదల చేయగా.. డీగ్లామరైజ్‌డ్‌గా కనిపిస్తూ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా గ్లామరస్ పాత్రలకే పరిమితమైన ఈ భామ తంగలాన్‌లో ఎప్పుడూ చూడని స్టన్నింగ్ లుక్‌ తో కనిపించింది. విక్రమ్ ఈ ఏడాది విడుదల అయినా పొన్నియన్ సెల్వన్ 2 లో నటించి మెప్పించాడు.. ఆ సినిమా మంచి విజయం సాధించింది.. అలాగే గౌతమ్ వాసుదేవ మీనన్ డైరెక్షన్ లో ధ్రువ నచ్చత్రం అనే సినిమాలో నటించాడు.. ఈ సినిమా నవంబర్ 24 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

https://twitter.com/officialneelam/status/1719262400841752917?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1719262400841752917%7Ctwgr%5E4f400116ac3f6bf50257c64e79905339651e978e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F