Leading News Portal in Telugu

Sri Divya: అమ్మడు ప్రేమించింది హీరోనేనా.. ?



Sri

Sri Divya: టాలీవుడ్ హీరోయిన్ శ్రీదివ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈ భామ బస్టాప్, కేరింత లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక శ్రీదివ్య తెలుగులో కాకుండా తమిళ్ లో మంచి పేరును తెచ్చుకుంది. అక్కడ స్టార్ హీరోయిన్ గా మారింది. విశాల్ దగ్గరనుంచి వెంకట్ ప్రభు వరకు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ భామ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీదివ్య.. వెంకట్ ప్రభు హీరోగా నటిస్తున్న రైడ్ చిత్రంలో నటిస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో శ్రీదివ్య బిజీగా మారింది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ఒక రిపోర్టర్ .. మీ పెళ్లి ఎప్పుడు.. ? ప్రేమ పెళ్లినా..? పెద్దలు కుదిర్చిన పెళ్లినా.. ? అని అడిగాడు.

Leo: లియో అన్ కట్ వెర్షన్.. కేవలం వారికి మాత్రమే

ఇక తన పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు శ్రీదివ్య మాట్లాడుతూ.. “త్వరలోనే నేను పెళ్లి చేసుకుంటాను. ప్రేమ వివాహమే చేసుకుంటాను. అదీ నా ప్రియుడినే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులందరూ శ్రీదివ్య ప్రేమించిన అబ్బాయి ఎవరు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. గతంలో ఈ చిన్నది.. ఒక కోలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో ఉందని వార్తలు గుప్పుమన్నాయి. మరి అదే హీరోను పెళ్లాడనుందా.. ? లేక వేరే వ్యక్తా.. ? అనేది తెలియాల్సి ఉంది.