Leading News Portal in Telugu

Priyanka Chopra: ప్రియాంక చోప్రా పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?


Priyanka Chopra: ప్రియాంక చోప్రా పెట్టుకున్న ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?

అటు బాలీవుడ్.. ఇటు హాలివుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది..ఇప్పుడు హాలీవుడ్ లో సత్తా చాటుతుంది. ఇటీవలే సిటాడెల్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. భారతదేశంలోని అత్యంత సంపన్న నటీమణులలో ప్రియాంక చోప్రా ఒకటి.. మొదటిది కూడా..

అమెరికాకు చెందిన సింగర్ ను పెళ్ళాడిన ఈ అమ్మడు ఇప్పుడు అక్కడే ఉంటుంది.. తాజాగా ప్రియాంక ఇండియాకు తిరిగి వచ్చింది..జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌కు వచ్చిన నటి ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్ మీద డిఫరెంట్ డ్రెస్ వేసుకుని నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ప్రియాంక ధరించిన డిజైనర్ దుస్తులతో పాటు ఆమె ధరించిన వాచ్ కూడా అందరిని ఆకర్శించింది.. నిజంగానే ఆ వాచ్ చాలా కొత్తగా ఉండటంతో నెటిజన్లు దాన్ని గురించి గూగుల్ లో వెతికేస్తున్నారు..

ఆ వాచ్ ధర విని షాక్ అవుతున్నారు..ప్రియాంక ధరించిన వాచ్ ధర వేలల్లోనో, లక్షల్లోనో కాదు కోట్లలో ఉంటుందట. మామి ఫిల్మ్ ఫెస్టివల్‌కి వచ్చిన నటి ప్రియాంక చోప్రా కంప్లీట్ వాచ్ కాకుండా అందమైన ఆభరణంలా కనిపించే డిఫరెంట్ వాచ్ ధరించింది. ఆమె ధరించిన వాచ్ బల్గారీ బ్రాండ్.. బంగారం , వజ్రం ఉపయోగించి తయారు చేశారు.. ఈ వాచ్ ధర అక్షరాల రూ.1.50 కోట్లు ఉంటుందని టాక్..బాలీవుడ్ నటీమణులతో పోలిస్తే హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకుంటుంది. కేవలం ల్లోనే కాకుండా యాడ్స్, బ్రాండ్ అంబాసిడర్ గాను ఎక్కువగానే అందుకుంటుంది. అంతేకాదు.. నటనతో పాటు పలు వెంచర్లలో పెట్టుబడులు పెట్టింది.. మొత్తానికి ఈ అమ్మడు భారీగానే డబ్బులను సంపాదిస్తుంది..