Leading News Portal in Telugu

Devara: ఆ పేర్లేంటి? ఆ బ్యాక్ డ్రాప్ ఏంటి? ఏం చేస్తున్నావ్ కొరటాల మావా?


Devara: ఆ పేర్లేంటి? ఆ బ్యాక్ డ్రాప్ ఏంటి? ఏం చేస్తున్నావ్ కొరటాల మావా?

కొరటాల శివ అనగానే కమర్షియల్ సినిమాలకి కూడా సోషల్ మెసేజ్ అద్ది ఇండస్ట్రీ హిట్స్ కొట్టొచ్చు అని నిరూపించిన దర్శకుడు గుర్తొస్తాడు, రెస్పాన్సిబిలిటీతో రాసే ఒక రైటర్ గుర్తొస్తాడు. అలాంటి కొరటాల శివ ఆచార్య సినిమాతో చాలా నెగటివిటిని మూటగట్టుకున్నాడు. ఆ చెడ్డ పేరు అంతా ఒకేసారి తుడిచేయడానికి, తన సత్తా ఎంతో మరోసారి ప్రూవ్ చెయ్యడానికి కొరటాల శివ, ఎన్టీఆర్ ని దేవరగా చూపించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే రిలీజ్ డేట్ కూడా చెప్పేసి అంచనాలు పెంచేసాడు కొరటాల శివ. దేవర సినిమా షూటింగ్ జరుగుతున్న స్టాండర్డ్స్ హాలీవుడ్ రేంజులో ఉన్నాయి. అన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని బ్యాక్ టు బ్యాక్ షూట్ చేసిన కొరటాల శివ, సముద్రాన్ని రక్తంతో ముంచనున్నాడు.

ఎన్టీఆర్ ని సముద్ర వీరుడు దేవరగా చూపించనున్న కొరటాల శివ, విలన్ సైఫ్ ని భైరాగా ప్రెజెంట్ చేయనున్నాడు. లేటెస్ట్ గా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, ఆమె మా ‘తంగం’ అంటున్నాడు. తంగం అనేది తమిళ పదం, బంగారం అని అర్ధం. దేవర, భైర, తంగం… ఈ పేర్లు రెగ్యులర్ గా లేకుండా చాలా కొత్తగా ఉన్నాయి. కొరటాల శివ అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడో ఎవరికీ అంతుబట్టట్లేదు. కొత్త ప్రపంచం, భయానికి భయం పుట్టించే వీరుడి కథ అంటున్నాడు కానీ కథ గురించి చిన్న హింట్ కూడా ఇవ్వట్లేదు కొరటాల శివ. రెండు పార్ట్స్ గా రిలీజ్ కానున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇందులో యంగ్ క్యారెక్టర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. మరి ఫాదర్ క్యారెక్టర్ కి హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.