Leading News Portal in Telugu

Maa Oori Polimera 2 : ఆసక్తి రేకెత్తిస్తున్న పొలిమేర 2 రిలీజ్ ట్రైలర్.


Maa Oori Polimera 2 : ఆసక్తి రేకెత్తిస్తున్న పొలిమేర 2 రిలీజ్ ట్రైలర్.

సత్యం రాజేశ్‌ , కామాక్షి భాస్కర్ల మరియు బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2.. ఈ మూవీ నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. డాక్టర్ అనిల్‌ విశ్వనాథ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ హార్రర్ థ్రిల్లర్‌ మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్‌ గా తెరకెక్కింది. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్‌ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.ఇటీవలే హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. తాజాగా రిలీజ్‌ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఊర్ల అందరు మంచిగున్నార్‌ రా.. అని సత్యం రాజేశ్‌ గెటప్‌ శ్రీనును అడుగుతుంటే.. నువ్వు సచ్చినవ్‌ అని ఊళ్లో అంతా నమ్ముతున్నారు. నీ పెళ్లాం నువ్ బతికున్నావనే నిజాన్ని మోయాలో.. దాయాలో తెలియక రోజూ చస్తూ బతుకుతుంది.. రా అనే డైలాగ్స్ తో ట్రైలర్ సాగుతుంది..

పొలిమేర 1లో చేతబడి చేసే సన్నివేశాలతో అందరికీ గూస్‌బంప్స్ తెప్పించిన సత్యం రాజేశ్‌.. ఆ సస్పెన్స్‌, థ్రిల్‌ను పొలిమేర 2లో కూడా కంటిన్యూ చేయబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చాడు.మా ఊరి పొలిమేర 2లో గెటప్‌ శీను, రాకేందు మౌళి, సాహిత్య దాసరి. మరియు రవివర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే లాంఛ్ చేసిన ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది… రిలీజ్‌కు ముందే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియాలోనే ఎక్కువగా వీక్షించిన రెండో ట్రైలర్‌గా మా ఊరి పొలిమేర 2 అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.పల్లెటూరి నేపథ్యంలో చేతబడి (బ్లాక్ మ్యాజిక్‌) చుట్టూ తిరిగే డబుల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సీక్వెల్ ఉండబోతున్నట్టు టీజర్‌, ట్రైలర్‌తో దర్శకుడు క్లారిటీ ఇచ్చేసాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.మా ఊరి పొలిమేర మొదటి పార్ట్ డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దీనితో రెండవ పార్ట్ ను మేకర్స్ భారీగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి..

https://twitter.com/SureshPRO_/status/1719673090068914646?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1719673090068914646%7Ctwgr%5E97354c93002897241bb590de15bf8521495358ac%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F