
ఐశ్వర్య లక్ష్మీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు పేరు సుపరిచితమే.. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన మట్టి కుస్తీ అనే చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా మైండ్ బ్లాక్ చేసే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
అలాగే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ. ఈ మూవీలో తన అందాలతో ఆకట్టుకుంది.. ఇకపోతే తాజాగా మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత అనే సినిమాలో నటించింది. ఈ తెలుగులోనూ డబ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఐశ్వర్య. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంతా ఈజీ కాదు. ముఖ్యంగా ఇప్పుడున్న సినీ ప్రపంచంలో హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంది. హీరోయిన్స్ సినీ రంగ ప్రవేశం చేయాలన్నా.. మరీ ముఖ్యంగా ఇక్కడ నిలదొక్కు కోవాలన్నా ప్రతిభ, గ్లామర్ ఫస్ట్ ప్రయారిటీగా మారిపోయింది. ఈ విషయాన్ని సైతం చాలామంది హీరోయిన్లు పబ్లిక్ గానే ఒప్పేసుకుంటున్నారు.. ఇప్పుడు ఐశ్వర్య కూడా రోజూ రోజుకు గ్లామర్ డోస్ ను పెంచుతుంది.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంది..