
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా దాటి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. ఈ రెండు యాక్టింగ్ పవర్ హౌజ్ లు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో అద్భుతంగా నటించి వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసారు. ఇండియాకి ఆస్కార్ అవార్డుని తెచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్ ని అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరేలా చేసింది. ఎన్టీఆర్ ఆస్కార్ అకాడెమీ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణం. ఇప్పుడు ఇదే లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా చేరిపోయాడు. అకాడెమీ కొత్తగా ప్రకటించిన యాక్టర్స్ బ్రాంచ్ లిస్టులో చరణ్ కూడా ఉన్నాడు. ఆస్కార్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
చరణ్ ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో చేరాడు అనే వార్త బయటకి రాగానే మెగా అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేసారు. సెలబ్రేషన్ మోడ్ లో ఫుల్ ట్వీట్స్ చేస్తూ రామ్ చరణ్ పేరుని, గ్లోబల్ స్టార్ ట్యాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. “Through their nuanced portrayal and dedication to authenticity, these actors gift us with characters that leave a lasting impression on our hearts and minds. Their mastery of their art form transforms ordinary moments into extraordinary cinematic experiences, enriching our appreciation for the depth and complexity of human emotions. We’re thrilled to welcome these accomplished performers to the Actors Branch of the Academy. Lashana Lynch, Ram Charan, Vicky Krieps, Louis Koo Tin-Lok, Keke Palmer, Chang Chen, Sakura Ando, Robert Davi” అంటూ అకాడెమీ పోస్ట్ చేసింది.
View this post on Instagram